ప్రసవం కోసం నరకయాతన.. అడవిలో 6 కి.మీ. నడిచెళ్లిన నిండుగర్భిణి! అంతలో పెను విషాదం
ఓ నిండు గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. గత్యంతరంలేక టౌన్‌లో ఉన్న ఆస్పత్రికి వెళ్లవల్సి వచ్చింది. అయితే ఆమె చేసిన సాహసం అంతాఇంతాకాదు. ఏకంగా 6 కిలోమీటర్ల అవతల ఉన్న ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్లి సొమ్మసిల్లింది. వైద్యులు పరుగున వచ్చి చికిత్స అందించేలోపే ఆ నిండు గర్భిణీ..

భోపాల్, జనవరి 3: ఆ ఊరికి రోడ్లు లేవు. వాహనాలు రావు. కనీసం ఓ చిన్న ఆస్పత్రి అయినా లేదు. ఇంతలో నిండు గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. గత్యంతరంలేక టౌన్‌లో ఉన్న ఆస్పత్రికి వెళ్లవల్సి వచ్చింది. అయితే ఆమె చేసిన సాహసం అంతాఇంతాకాదు. ఏకంగా 6 కిలోమీటర్ల అవతల ఉన్న ఆస్పత్రికి నడుచుకుంటూ వెళ్లి సొమ్మసిల్లింది. వైద్యులు పరుగున వచ్చి చికిత్స అందించేలోపే ఆ నిండు గర్భిణీ.. తన కడుపులో బిడ్డతో సహా కన్నుమూసింది. ఈ హృదయవిదారక ఘటన భోపాల్‌లోని గడ్చిరోలీలో శుక్రవారం (జనవరి 2) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
మహారాష్ట్రలోని గడ్చిరోలీకి రోడ్డు మార్గం, సరిగ్గా వైద్య సదుపాయాలు కూడా లేవు. అక్కడి ఎటపల్లి తాలూకాలోని ఆల్దండి టోలో గ్రామానికి చెందిన ఆశా సంతోష్ కిరంగ (24) తొమ్మిది నెలల నిండు గర్భిణి. ఆ స్వగ్రామంలో రోడ్డు మార్గతోపాటు వైద్య సదుపాయాలు కూడా లేవు. దీంతో ఆమె డెలివరీ కోసం తన భర్తతో కలిసి అడవి మార్గం గుండా ప్రయాణించింది. అలా దాదాపు 6 కి.మీలు నడుచుకుంటూ జనవరి 1వ తేదీన వెళ్లారు. పక్క ఊరిలో ఉన్న తన అక్క ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలో జనవరి 2వ తేదీన ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబసభ్యులు వెంటనే అంబులెన్స్‌లో హెడ్రిలోని కాళీ అమ్మాల్ ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు సిజేరియన్ ఆపరేషన్ చేయాలని నిర్ణయించినప్పటికీ, అప్పటికి చాలా ఆలస్యమైంది. అప్పటికే తీవ్ర రక్తస్రావమవడంతో కడుపులోనే శిశివు మరణించింది. రక్తపోటు పెరగడంతో మహిళ కూడా కొద్దిసేపటికే మరణించింది. ఈ ఘటనపై గడ్చిరోలి జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రతాప్ షిండేను సంప్రదించగా.. ఆ మహిళ ఆశా కార్యకర్తల ద్వారా నమోదు చేయబడిందని చెప్పారు. ఆకస్మిక ప్రసవ నొప్పులు ఎక్కువగా నడవడం వల్ల వచ్చి ఉండవచ్చు. వైద్యులు ఆమెను కాపాడటానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. తల్లీబిడ్డ మృతిచెందారు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




