AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: చేతిలో త్రిశూలం.. నుదిటిపై తిలకం.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ వేడుకల్లో ప్రధాని మోదీ..

భారతీయ నాగరికత ఎదురుదెబ్బలను తట్టుకుని నిలబడిన ధైర్యానికి నిలువెత్తు సాక్ష్యం సోమనాథ్ క్షేత్రం. సరిగ్గా వెయ్యేళ్ల క్రితం సోమనాథ్ ఆలయంపై జరిగిన మొదటి దాడికి గుర్తుగా, ఆ చారిత్రక ఘట్టాన్ని సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌గా మారుస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు రోజుల గుజరాత్ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఆధ్యాత్మికత, అభివృద్ధి మేళవింపుగా సాగుతున్న ఈ పర్యటనలో ఎన్నో విశేషాలు నెలకొన్నాయి.

Krishna S
|

Updated on: Jan 10, 2026 | 11:19 PM

Share
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మూడు రోజుల గుజరాత్ పర్యటనను శనివారం ఆధ్యాత్మిక క్షేత్రం సోమనాథ్‌లో అత్యంత వైభవంగా ప్రారంభించారు. రాజ్‌కోట్ నుండి హెలికాప్టర్‌లో చేరుకున్న ప్రధానికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని మోడీకి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

1 / 7
సోమనాథ్ పర్యటనపై ప్రధాని సోషల్ మీడియాలో స్పందిస్తూ.. మన నాగరికత ధైర్యసాహసాలకు సోమనాథ్ ఒక అద్భుతమైన చిహ్నమని కొనియాడారు. 1026లో సోమనాథ్ ఆలయంపై జరిగిన మొదటి దాడికి వెయ్యి సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్‌లో పాల్గొనడం తన అదృష్టమని ఆయన తెలిపారు.

2 / 7
శనివారం సాయంత్రం ప్రధాని మోడీ సోమేశ్వర్ మహాదేవ్ మహా ఆరతిలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన స్వయంగా ఓంకార మంత్రాన్ని జపించడం ప్రారంభించారు. ఈ జపం సుమారు 72 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగనుంది. ఇదే సమయంలో 3,000 డ్రోన్లతో సోమనాథ్ చరిత్రను ఆవిష్కరిస్తూ నిర్వహించిన డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

3 / 7
ఆదివారం ఉదయం ప్రధాని జ్యోతిర్లింగ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం సోమనాథ్ పట్టణంలో సుమారు ఒక కిలోమీటరు మేర సాగే శౌర్య యాత్రలో ఆయన పాల్గొంటారు. దేశభక్తి, సాంస్కృతిక చైతన్యాన్ని నింపే ఈ యాత్ర తర్వాత ఆయన రాజ్‌కోట్‌కు చేరుకుని ప్రాంతీయ చైతన్య శిఖరాగ్ర సమావేశాన్ని ప్రారంభిస్తారు.

4 / 7
పర్యటనలో భాగంగా జనవరి 12న ప్రధాని మోడీ జర్మనీ ఛాన్సలర్ మెర్జ్‌తో కీలక సమావేశం నిర్వహిస్తారు. ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపారం, పెట్టుబడులపై ఇరు దేశాల నాయకులు చర్చించనున్నారు. అనంతరం అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీతీరంలో నిర్వహించే అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాన్ని వారు సంయుక్తంగా ప్రారంభిస్తారు.

5 / 7
రాజకీయ, వ్యూహాత్మక పర్యటనలో భాగంగా ఇద్దరు నాయకులు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. ఇది ప్రపంచ స్నేహానికి, భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలవనుంది. అంతర్జాతీయ గాలిపటాల పండుగలో పాల్గొనడం ద్వారా ప్రపంచ దేశాలకు భారతీయ పండుగల విశిష్టతను చాటిచెప్పనున్నారు.

6 / 7
పర్యటన ముగింపులో ప్రధాని మోడీ అహ్మదాబాద్ పాత హైకోర్టు స్టేషన్ నుండి గాంధీనగర్ వరకు మెట్రోలో ప్రయాణిస్తారు. సచివాలయం నుండి మహాత్మా మందిర్ వరకు కొత్తగా నిర్మించిన మెట్రో విభాగాన్ని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. ఆధ్యాత్మికత, అభివృద్ధి, అంతర్జాతీయ దౌత్యం కలయికగా ప్రధాని గుజరాత్ పర్యటన కొనసాగుతోంది.

7 / 7