AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: వారికి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (జనవరి 11-17, 2026): మేష రాశి వారికి ఈ వారమంతా జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు మరింతగా మెరుగుపడతాయి. వృషభ రాశి వారికి వారం రోజుల పాటు జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. మిథున రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 10, 2026 | 5:47 PM

Share
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, శుక్ర గ్రహాల అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు మరింతగా మెరుగుపడతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు చాలావరకు ఫలిస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ది చెందుతుంది. ఆర్థిక అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆస్తి వివాదాల పరిష్కారానికి  సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించిన శుభ వార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభ కార్యాలు, కుటుంబం మీద ఖర్చులు పెరగవచ్చు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): రాశ్యధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల వారం రోజుల పాటు జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. కుజుడు, రవి గ్రహాల సంచారం కూడా అనుకూలంగా ఉన్న ఫలితంగా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. బంధుమిత్రుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు చేసి లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు కొత్త ఆపర్లు అందుతాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్య సిద్ధి కలుగుతుంది. అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి.  ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యులతో కలిసి తీసుకోవడం మంచిది.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): గురు, బుధ, రవి  గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా ఆడింది ఆటగాపాడింది పాటగా సాగిపోతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అంది వస్తాయి. ఆర్థిక స్థిరత్వం చోటు చేసుకుంటుంది.  ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువర్గం ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి కాస్తంత అధికంగానే ఉండవచ్చు. కుజ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయానికి లోటుండకపో వచ్చు. ఉద్యోగంలో కొద్దిగా ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఎటువంటి ప్రయత్నమైనా సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. కుటుంబ జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి మంచి విశేషాలు తెలుస్తాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఈ వారమంతా గురు, కుజ, రవి సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధమైన ఎలాంటి ప్రయత్నం అయినా కలిసి వస్తుంది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి అవకాశాలు పెరుగుతాయి. బంధుమిత్రులతో విందులు, వినోదాలకు ప్లాన్ చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. సోదర వర్గంతో అనుకోకుండా స్థిరాస్తి వివాదం పరిష్కారం అవుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రస్తుతానికి ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): కుజ, శనులు మినహా మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా శుభ వార్తలు ఎక్కువగా వినే అవకాశం ఉంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. బుధ, గురు, శుక్ర గ్రహాల అనుకూలత వల్ల లాభాలపరంగా వృత్తి, వ్యాపారాలు బాగా బలం పుంజు కుంటాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహా రాల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆశించిన స్థాయిలో ధన లాభాలు కలుగుతాయి. రావలసిన సొమ్మంతా వసూలవుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. సన్నిహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): గురు, శుక్ర, రవి, కుజ, శని గ్రహాలు పూర్తిగా అనుకూలంగా ఉన్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలను మించి లాభిస్తాయి. ఉద్యోగంలో ప్రాభవం, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. వృత్తి జీవితంలో కూడా దూసుకుపోతారు. వ్యాపారాలు ఆర్థికంగా బాగా బలం పుంజుకుంటాయి. ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. దూర ప్రాంతంలో ఉంటున్న బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగం మారే అవకాశం ఉంది. జీవిత భాగ స్వామికి ఆర్థిక పురోగతి లభిస్తుంది. ఇతరుల వివాదాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. తల్లి తండ్రులు, తోబుట్టువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. బంధుమిత్రులకు సహాయంచేస్తారు.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): ధన స్థానంలో రాశ్యధిపతి కుజుడు రవి, బుధులతో కలిసినందువల్ల ఆర్థిక పరిస్థితి ఇదివరకటికంటే బాగా అనుకూలంగా మారుతుంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ జీవితం కూడా ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా కొనసాగుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక పరమైన ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.

8 / 12
ధనుస్సు (మూల,  పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి గురువుతో పాటు, రవి, కుజ, శుక్ర గ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా మారినందు వల్ల వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులకు, జీతభత్యాల పెరుగుదలకు బాగా అవకాశం ఉంది. వ్యాపా రాలు కూడా అంచనాలకు మించి లాభాలు అందిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్య మైన ప్రయత్నాలు, వ్యవహారాలు సానుకూలం అవుతాయి. నిదానంగా, నిబ్బరంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం మంచిది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): శుక్ర, శని, రాహువుల అనుకూలత వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. మీ ప్లాన్లు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. లాభదాయకమైన పరిచయాలు  ఏర్పడతాయి. కొన్న కీలకమైన ఆర్థిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడతారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. తల్లితండ్రులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. ఒకరిద్దరు బంధుమిత్రులకు ధన సహాయం చేస్తారు.

10 / 12
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ధన స్థానంలో ఉన్న రాశ్యధిపతి శని వల్ల ఏలిన్నాటి శని దోషం కలిగినప్పటికీ, ఆదాయానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. కొద్దిగా నిదానంగానే అయినా ప్రతి పనీ పూర్తవుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా కొద్దిగా పుంజుకుంటాయి. మీ వ్యూహాలు, ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగాల్లో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. ప్రముఖులకు సన్నిహితం అవుతారు. కొన్ని ముఖ్యమైన వ్యవ హారాలను పూర్తి చేయడం మంచిది. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుండదు. ఇతరులకు సహాయం చేసే విషయంలో వీలైనంత జాగ్ర త్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో తగిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఈ వారంలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు లాభ స్థానంలో ప్రవేశిస్తున్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడే అవకాశం ఉంది. రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి.  ఏ ప్రయత్నం తల పెట్టినా సఫలమవుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యమైన పెండింగ్ పనులు పూర్తవుతాయి. అనవసర పరిచయాలకు దూరంగా ఉండాలి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తోబుట్టువులు, కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడక పోవడం మంచిది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెంది ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

12 / 12