AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Jayanti Special: హనుమంతుడికి ఇష్టమైన స్పెషల్ స్వీట్ రెసిపీ మీకోసం..!

ప్రతీ ఏటా చైత్ర పౌర్ణమినాడే హనుమాన్ జయంతి జరుపుకుంటారు. ఈ రోజు శ్రీ హనుమంతుడి జన్మదినాన్ని పురస్కరించుకుని భక్తులు భక్తిశ్రద్ధలతో మంత్రాలు జపిస్తూ, పూజలు నిర్వహిస్తూ, ఉపవాసం చేస్తారు. కొందరు సుందరకాండ పారాయణం చేసి ఆలయంలో పుష్పాలు, చందనం, మిఠాయిలు సమర్పిస్తారు.

Hanuman Jayanti Special: హనుమంతుడికి ఇష్టమైన స్పెషల్ స్వీట్ రెసిపీ మీకోసం..!
Hanuman Jayanti Sweet Recipe
Prashanthi V
|

Updated on: Apr 11, 2025 | 2:49 PM

Share

హనుమాన్ జయంతి రోజున ప్రత్యేకంగా నైవేద్యాలు వండి సమర్పించడం ద్వారా భగవంతుని కృప పొందవచ్చని నమ్మకం ఉంది. కుంకుమపువ్వుతో చేసిన స్వీట్ రెసిపీని అందించటం హనుమంతుడికి అత్యంత ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా మనం ఒక ప్రత్యేకమైన నైవేద్యం తయారు చేయబోతున్నాం. అది చాక్లెట్ కలిపిన కేసరి ఫిర్నీ. సాధారణంగా ఫిర్నీను పాలు, బాస్మతి బియ్యం, కుంకుమపువ్వు వాడి చేస్తారు. కానీ ఈసారి బోర్న్‌విల్లే డార్క్ చాక్లెట్‌ని కూడా కలిపి ఆ ఫిర్నీకి కొత్త రుచి, ప్రత్యేకత తీసుకురానున్నాం. ఇది దేవుడికి నైవేద్యంగా కూడా బాగా సరిపోతుంది.

కావాల్సిన పదార్థాలు

  • ఫుల్ క్రీమ్ మిల్క్ – 1 లీటరు
  • బాస్మతి రైస్ – ¼ కప్పు
  • చక్కెర – రుచికి సరిపడా
  • బోర్న్‌విల్లే డార్క్ చాక్లెట్ – 50 గ్రాములు
  • కుంకుమపువ్వు – 10 నుంచి 12 (2 స్పూన్ల వేడి పాలలో నానబెట్టాలి)
  • యాలకుల పొడి – ½ టీ స్పూన్
  • డ్రై ఫ్రూట్స్ – 2 స్పూన్లు (బాదం, పిస్తా ముక్కలుగా తరిగినవి)
  • రోజ్ వాటర్ – ½ టీ స్పూన్ (ఆప్షనల్ మాత్రమే)
  • సిల్వర్ వార్క్ – అలంకరణ కోసం (ఆప్షనల్ మాత్రమే)

తయారీ విధానం

మొదట బాస్మతి రైస్ ని 30 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత ఆ రైస్ లో కొద్దిగా నీరు పోసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ ఆన్ చేసి ఒక పెద్ద పాత్రలో పాలను తీసుకుని తక్కువ మంటపై వేడి చేస్తూ మరిగించాలి. పాలు మరిగిన తర్వాత అందులో రుబ్బిన రైస్ పేస్ట్ ని వేసి అడుగంటకుండా కలుపుతూ ఉడికించాలి. రైస్ పూర్తిగా ఉడికే వరకు అంటే దాదాపు 10 నుంచి 12 నిమిషాల వరకు నెమ్మదిగా వండాలి.

తరువాత చక్కెరను వేసి బాగా కలపాలి. ఆ వెంటనే కుంకుమపువ్వు నానబెట్టిన పాలను, యాలకుల పొడిని కూడా జత చేసి మరో ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత స్టవ్ మంట తక్కువగా పెట్టి బోర్న్‌విల్లే చాక్లెట్‌ను అందులో వేసి అది పూర్తిగా కరిగి మిశ్రమంలో బాగా కలిసే వరకు నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. చాక్లెట్ పూర్తిగా కలిసిన తరువాత రోజ్ వాటర్ ని వేసి ఒకసారి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ ఫిర్నీ మిశ్రమం చల్లారిన తర్వాత చిన్న చిన్న మట్టి కప్పుల్లోకి తీసుకోని ఫ్రిడ్జ్‌లో రెండు నుంచి మూడు గంటల పాటు ఉంచాలి. ఇలా చేసిన ఫిర్నీ చల్లగా తినడానికి చాలా రుచిగా ఉండటంతో పాటు పూజా నైవేద్యంగా కూడా ప్రత్యేకతను చాటుతుంది.

ఫిర్నీ తయారయ్యాక పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్‌ (బాదం, పిస్తా ముక్కలు) చల్లి కావాలంటే సిల్వర్ వార్క్ ను అలంకరణగా ఉపయోగించండి. ఈ ఫిర్నీని చల్లగా వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది. ఇది నైవేద్యంగా అర్చించడానికి అద్భుతంగా ఉంటుంది. శ్రీ హనుమంతునికి భక్తితో ఈ మధురమైన ఫిర్నీని సమర్పించి ఆ తరువాత కుటుంబ సభ్యులతో కలిసి తినండి.

సాంప్రదాయంగా ఈ రెసిపీని వడ్డించండిలా

  • మట్టి కప్పులు ఫిర్నీని చల్లగా ఉంచుతాయి. మట్టి తేమను తీయడంతో ఫిర్నీకి ప్రాకృతిక రుచిని ఇస్తుంది. భక్తితో సమర్పించేందుకు ఇది మంచి ఎంపిక.
  • వెండి పాత్రలు పవిత్రతకు చిహ్నం. అందులో వడ్డిస్తే దేవునికి ఇచ్చే నైవేద్యం మరింత విశిష్టంగా భావించబడుతుంది.
  • అరటి ఆకులపై వడ్డించటం మన ప్రాచీన సంప్రదాయం. ఆకుల వాసన వల్ల ఫిర్నీకి ప్రత్యేకమైన రుచి, పవిత్రత వస్తుంది.
  • ఉర్లి అంటే వెడల్పుగా ఉండే పాత్ర. దేవాలయాల్లో పూజల సమయంలో నైవేద్యం ఉర్లిలో ఉంచే తీరును గుర్తు చేస్తుంది. అలా పెడితే పూజా ప్రాంగణపు శుభతను అనుభవించవచ్చు.
  • తులసి ఆకు పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఫిర్నీపై చివరగా తులసి ఆకు ఉంచడం ద్వారా ఆ నైవేద్యం శుద్ధమైనదిగా మారుతుంది.