AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీప్‌గా చూడొద్దు.. మండే ఎండల్లో బెస్ట్ ఎనర్జీ డ్రింక్.. తాగారంటే దెబ్బకు షేక్ అవ్వాల్సిందే..

వేసవిలో చాలా మంది మ్యాంగో షేక్ తాగడానికి అందరూ ఇష్టపడతారు. ఇది శరీరానికి తాజాదనాన్ని అందించడంలో సహాయపడుతుంది. కానీ ప్రతిదానికీ ప్రయోజనాలు.. అప్రయోజనాలు రెండూ ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.. కాబట్టి వేసవిలో మ్యాంగో షేక్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు.. నష్టాలు, అలాగే ఏ వ్యక్తులు దీన్ని తాగకూడదో నిపుణుల నుంచి తెలుసుకోండి..

చీప్‌గా చూడొద్దు.. మండే ఎండల్లో బెస్ట్ ఎనర్జీ డ్రింక్.. తాగారంటే దెబ్బకు షేక్ అవ్వాల్సిందే..
Mango Shake Benefits
Shaik Madar Saheb
|

Updated on: Apr 11, 2025 | 1:38 PM

Share

తీపిగా.. భలే రుచిని కలిగి ఉండే మామిడి పండును చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ లాగించేస్తారు. అందుకే మామిడి పండును.. పండ్లలో రారాజు అని పిలుస్తారు. వేసవిలో లభించే ఈ మామిడి పండు ప్రత్యేకత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దీనిని పచ్చిగా.. పండుగా, అలాగే ఉడికించి తింటారు. దీనితోపాటు చాలా రుచికరమైన ఆహార పదార్థాలు, పానీయాలు కూడా తయారు చేస్తారు. వీటిలో మామిడి షేక్ సర్వసాధారణం.. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీన్ని తాగడానికి ఇష్టపడతారు. పాలు, పండిన మామిడి పండ్లతో తయారు చేసిన మామిడి షేక్ వేసవిలో శరీరానికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.

మామిడిపండులో ఫోలేట్, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి, ఇ, కె మరియు బి6 వంటి పోషకాలు ఉన్నాయి.. ఇవి శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.. ఉదాహరణకు విటమిన్ ఎ కళ్ళకు చాలా మేలు చేస్తుంది. అటువంటి పరిస్థితిలో, వేసవిలో మామిడి షేక్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు..

అయితే.. మామిడి షేక్ వల్ల కలిగే ప్రయోజనాలు.. నష్టాలు ఏమిటి? అలాగే, ఏ వ్యక్తులు దీన్ని తాగకూడదు. నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ విషయాలను తెలుసుకుందాం.

మామిడికాయ షేక్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ఢిల్లీలోని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ చీఫ్ డైటీషియన్ ప్రియా పాలివాల్ మాట్లాడుతూ.. వేసవిలో మామిడి షేక్ తాగడం చాలా రుచికరంగా, చల్లగా ఉంటుందని చెప్పారు. అయితే దీనిని తాగడం వల్ల ప్రయోజనాలు – అప్రయోజనాలు రెండూ ఉన్నాయని అన్నారు. మామిడిలో విటమిన్ ఎ, సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పాలతో కలిపి చేసిన ఈ మ్యాంగో షేక్ మంచి శక్తి వనరుగా మారుతుంది.. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.. వేడిలో అలసటను తగ్గిస్తుంది.

మామిడికాయ షేక్ ఎవరు తాగకూడదు?

మామిడి షేక్‌ను పరిమిత పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో చక్కెర అధికంగా ఉంటుంది. దీనితో పాటు, బరువు తగ్గాలనుకునే వారు మామిడి షేక్‌ను తక్కువ మొత్తంలో తాగాలి.. ఎందుకంటే ఇందులో అధిక కేలరీలు ఉంటాయి. చాలా సార్లు ప్రజలు దీనికి ఎక్కువ చక్కెర కలుపుతారు.. దీంతో ఇది మరింత హానికరం చేస్తుంది. గ్యాస్, అసిడిటీ లేదా కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా మ్యాంగో షేక్‌ను వైద్యుల సూచనలతో మాత్రమే తీసుకోవాలి..

నిపుణుల సలహా ఏంటంటే..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకు ఒకసారి చిన్న గ్లాసులో పరిమిత చక్కెరతో మామిడి షేక్ తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది.. కానీ పెద్ద పరిమాణంలో తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చు.. రక్తంలో చక్కెర స్థాయిలు మరింత దిగజారిపోవచ్చు. కాబట్టి, మీరు వేసవిలో ఖచ్చితంగా మామిడి షేక్ తాగాలి.. కానీ మీ శరీర అవసరానికి అనుగుణంగా సమతుల్య పరిమాణంలో మాత్రమే త్రాగాలన్న విషయాన్ని మరువొద్దు.. మీకు ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉంటే, వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
60 ల్లో కూడా తాతలు ఉక్కులా ఉన్నారంటే రీజన్ ఇదే..
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
స్పెషల్ TETకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? DEd, BEdవాళ్లు రాయొచ్చా?
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
జూలై 24న తెలంగాణలో విద్యా సంస్థలు బంద్‌.. కారణం ఏంటంటే..
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
భారీగా పెరిగిన IBPS బ్యాంక్ ఉద్యోగాలు..! దరఖాస్తుకు మరో ఛాన్స్
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
కదులుతున్న రైలులో ఇలా చేస్తే భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఖాయం
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
మాంసం కూరలు తిన్నా రాని శక్తి ఇది గిన్నెడు తింటే రెండింతలు
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
గ్రీన్ టీ ప్రతిరోజూ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుస
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
జూలై 23 దినఫలాలు: ఈ రాశుల వారికి ఉద్యోగ, ధన యోగం.. మీ రాశి ఎలా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..