డయాబెటీస్ పేషెంట్స్‌కు క్యారెట్ జ్యూస్ వరం.. ఎలా తాగడం మంచిదంటే?

Samatha

9 January 2026

క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కంటి, చర్మ ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది.

ఆరోగ్యానికి మంచిది

అందుకే చాలా మంది ఎక్కువగా క్యారెట్ తినడానికి ఇష్టపడుతారు. కొంత మంది క్యారెట్ జ్యూస్‌ను ఇష్టంగా తాగుతుంటారు. దీని వలన కూడా అనేక లాభాలు ఉన్నాయి.

ఇంట్రస్ట్ ఎక్కువ

అయితే డయాబెటీస్ పేషెంట్స్ క్యారెట్ జ్యూస్ తాగడం చాలా మంచిదంట. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందంట.

డయాబెటీస్ పేషెంట్స్

సదరన్న డెన్మార్క్ విశ్వవిద్యాలం జరిపిన ఓ సర్వేలో టైప్ 2 డయాబెటీస్ పేషెంట్స్‌కు క్యారెట్ జ్యూస్ చాలా మంచిదంట. అలాగే ఇది పేగు ఆరోగ్యాన్ని కాపాడుతున్నట్లు వారు తెలిపారు.

అధ్యయనంలో

క్యారెట్‌లో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యం చాలా ఎక్కువగా ఉన్నదంట. అలాగే ఇది గట్ బ్యాక్టీరియా కూర్పును సానుకూల ప్రభావం చూపిందంట.

రక్తంలో చక్కెర స్థాయిలను

క్యారెట్‌లలో బయోయాక్టివ్ సమ్మేళనాలు పుష్కలంగా ఉండటం వలన ఇవి చక్కెర గ్రహించే సామార్థ్యాన్ని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

బయోయాక్టివ్ సమ్మేళనాలు

అలాగే, ఇందులో ఉండే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్, ఎక్కువగా ఉండటం వలన ఇవి చక్కెర స్థాయిలను నియంత్రించి, అదే సమయంలో గట్ ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తాయంట.

ఫ్యాటీ యాసిడ్స్

అందువలన టైప్ 2 డయాబెటీస్ సమస్యతో బాధపడే వారు ప్రతి రోజూ క్యారెట్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఆఱోగ్యానికి మంచిది