Sankranti: కృష్ణాజిల్లా జి.కొండూరులో రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. పేదల కోసం సిద్ధం చేసిన లేఅవుట్లలో కోళ్ల పందెం బరుల ఏర్పాటు..

Sankranti: కృష్ణాజిల్లా జి.కొండూరులో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. పేదల కోసం ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన ప్లాట్ల లేఅవుట్లలోనే కోడి పందేలు..

Sankranti: కృష్ణాజిల్లా జి.కొండూరులో రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. పేదల కోసం సిద్ధం చేసిన లేఅవుట్లలో కోళ్ల పందెం బరుల ఏర్పాటు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 14, 2021 | 10:45 PM

Sankranti: కృష్ణాజిల్లా జి.కొండూరులో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. పేదల కోసం ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన ప్లాట్ల లేఅవుట్లలోనే కోడి పందేలు నిర్వహించారు. దీనిపై అడిగినందుకు బూతులు తిట్టారు. వివరాల్లోకెళితే.. జి.కొండూరు మండలంలోని ఆత్కూరు, వెల్లటూరు, గంగినేని గ్రామాల్లో కోడి పందేలు నిర్వహించారు. ఈ పందేల నిర్వహణ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం పేదలకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన లేఅవుట్లలోనే కోళ్ల పందేల కోసం బరులను ఏర్పాట్లు చేశారు. దాంతో పాటు అక్కడ మద్యం అమ్మకాలు కూడా సాగిస్తున్నారు. మాజీ జెడ్పీటీసీ, వైసీపీ నేత కాజా బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ఈ బరులను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై కొందరు ప్రశ్నలు లేవనెత్తగా.. వారిని బ్రహ్మయ్య తన నోటికివచ్చినట్లు దూషించాడు. ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందంటూ దబాయించాడు. ఆయన మాటలకు సంబంధించి వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలాఉండగా, కోడి పందేల బరుల వద్ద మద్యం అమ్మకాలు కూడా సాగిస్తుండటంతో పందేం రాయుళ్లు మద్యం సేవించి బెట్టింగ్‌లు కాస్తున్నారు. ఆ క్రమంలో ఒకరితో మరొకరు ఘర్షణలకు దిగుతున్నారు. పరస్పరం దూషించుకుంటున్నారు. కర్రలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. మరోవైపు చిన్న పిల్లలు సైతం కోళ్ల పందేనికి ఆసక్త చూపుతూ ఈ బరుల వద్దకు వస్తున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు, అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దాంతో రాజకీయ పార్టీల నేతలు తాము ఆడిందే ఆట.. పాడిందే పాటగా రెచ్చిపోతున్నారు.

Also read:

శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు వస్త్రాలు సమర్పించిన చెంచులు..

Thailand Open : 2వ రౌండ్‌లో సైనా నెహ్వాల్ పరాజయం.. గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిన శ్రీకాంత్