Thailand Open : 2వ రౌండ్‌లో సైనా నెహ్వాల్ పరాజయం.. గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగిన శ్రీకాంత్
సైనా నెహ్వాల్ థాయిలాండ్ ఓపెన్ రెండవ రౌండ్లో ఓటమిని చవిచూసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 23-21, 14-21, 16-21తో..

Thailand Open : సైనా నెహ్వాల్ థాయిలాండ్ ఓపెన్ రెండవ రౌండ్లో ఓటమిని చవిచూసింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 23-21, 14-21, 16-21తో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ చేతిలో ఓటమిపాలైంది. తొలి గేమ్‌లో మెరుగ్గా రాణించిన సైనా 23-21తో ఫస్ట్ సెట్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత రెండు సెట్లలో సైనా తప్పిదాలు చేయడం, ప్రపంచ 12వ ర్యాంకర్ బుసానన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి మ్యాచ్‌ను నెగ్గింది. ఇది ప్రపంచ 12 వ నంబర్ బుసానన్ చేతిలో సైనాకు వరుసగా నాలుగో ఓటమి. ఇక పురుషుల డబుల్స్‌లో తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ ముందంజ వేసింది. పారుపల్లి కశ్యప్ గాయంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. సమీర్ వర్మ 15-21, 17-21తో షెసార్ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. కాలి పిక్క కండరాలు పట్టేయడంతో టోర్నీ నుంచి వైదొలిగినట్లు కిదాంబి శ్రీకాంత్ గురువారం ప్రకటించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో శ్రీకాంత్ 21-12, 21-11తో భారత్‌కే చెందిన సౌరభ్ వర్మను ఓడించి రెండో రౌండ్‌లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
మరిన్ని ఇక్కడ చదవండి :
Samuthirakani : ‘ఆర్ఆర్ఆర్’ లో అవకాశం అలా వచ్చింది… ఆసక్తికర విషయాలు వెల్లడించిన సముద్రఖని