IPL 2025లో అత్యంత వేగవంతమైన బంతిని ఎవరు విసిరారో తెలుసా?
TV9 Telugu
08 April 2025
IPL 2025 లో ఇప్పటివరకు 19 మ్యాచ్‌లు జరిగాయి. ఈ 19 మ్యాచ్‌లలో అత్యంత వేగవంతమైన బంతిని ఎవరు బౌల్ చేశారో మీకు తెలుసా?
ఐపీఎల్ 2025లో తొలి 19 మ్యాచ్‌ల్లో ఫాస్టెస్ట్ బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన లాకీ ఫెర్గూసన్ అగ్రస్థానంలో ఉన్నాడు.
పంజాబ్ కింగ్స్ జట్టుకు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ లక్నోతో జరిగిన మ్యాచ్‌లో గంటకు 153.2 కి.మీ వేగంతో బంతిని విసిరాడు.
దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ కూడా 150+ మార్కును దాటాడు. అతను జాబితాలో రెండవ వేగవంతమైన బౌలర్‌గా నిలిచాడు.
గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న రబాడ.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 151.6 కి.మీ వేగంతో బంతిని వేశాడు.
ఈ జాబితాలో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ మూడో స్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడే ఆర్చర్, పంజాబ్ కింగ్స్‌పై 151 కి.మీ.ల వేగంతో బౌలింగ్ వేశాడు.
భారత బౌలర్లలో, మహమ్మద్ సిరాజ్ ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన బంతిని బౌలింగ్ చేశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను గంటకు 149.6 కి.మీ వేగంతో బౌలింగ్ చేశాడు.
ముందు ముందు ఈ రికార్డును ఎవరు బద్దలు కొడతారో వేచి చూడాలి. లాకీ ఫెర్గూసన్ రికార్డును బద్దలు కొడతారో చూడాలి.