స్కూటీపై నడి రోడ్డు మీద యువకుల స్టంట్స్.. చివరికి ట్విస్ట్ అదిరింది వీడియో
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో అల్లరి మూకలె చెలరేగిపోయాయి. పట్టణ ప్రధాన రహదారుల మీద ద్విచక్రవాహనాలపై ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు తొలగించి పెద్ద పెద్ద శబ్దాలతో రహదారిపై వెళ్లేవారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. పోలీసులు రాత్రివేళ గస్తీ కాసే సమయంలోనూ ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తుండడం గమనార్హం. ఈ క్రమంలోనే రాయచోటి పట్టణంలోని రింగ్ రోడ్డుపై ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వెళ్లడమే కాకుండా వాహనం ముందు చక్రం పైకి లేపి, ఒకే చక్రంతో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది.
రాయచోటి-మదనపల్లి రూట్‌లో బైక్‌పై స్టంట్ చేసిన ఇద్దరి యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 3న సాయంత్రం రాయచోటి-మదనపల్లి రూట్‌లో స్కూటీపై వేగంగా, నిర్లక్ష్యంగా స్టంట్లు చేస్తూ వెళ్తున్న ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. సదరు యువకులతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ లేని యువకులకు బండిని ఇచ్చిన యజమానిని కూడా ముద్దాయిగా చేర్చారు. రాయచోటి ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే.. కన్న బిడ్డలకు సైతం వాహనాలు ఇవ్వద్దని సూచించారు. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసినా.. అతివేగంగా ప్రయాణించినా.. ఆ సమయంలో ఏదైనా జరిగితే అది ఆ తల్లిదండ్రులకే బాధను కలిగిస్తుందని చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. చిన్నారులకు వాహనాలను ఇస్తే ఇక నుంచి తల్లిదండ్రులపైనా కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం
ఊబకాయులకు గుడ్ న్యూస్.. మార్కెట్లోకి బరువు తగ్గించే ఇంజక్షన్?
తోపులే జడుసుకున్నారు.. ఈ క్రూజ్ టూర్‌కి గుండె ధైర్యం ఉందా?వీడియో
పెళ్లి పీటలెక్కాల్సి ఉండగా.. మృత్యుఒడికి.. వీడియో
బెడ్‌రూమ్‌లో ఉండాల్సిన మంచం రోడ్డుపైకి వస్తే.. వీడియో

ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్ను అభినందించాల్సిందే

ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్

గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?

వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో

అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో

కారుల్లో వస్తారు.. రెక్కీ నిర్వహిస్తారు ఆ తర్వాత వీడియో

యువకుడి ఐడియా అదుర్స్.. ఏసీ కూడా పనికి రాదు వీడియో
