వామ్మో.. గంటకు శ్రేయాస్ అయ్యర్ సంపాదన ఎంతో తెలుసా?

TV9 Telugu

02 April 2025

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన పంజాబ్ ప్రత్యర్ధులను కలవరపెడుతోంది.

ఐపీఎల్ 2025 కోసం పంజాబ్ కింగ్స్ నుంచి శ్రేయాస్ అయ్యర్ రూ. 26.75 కోట్లు అందుకున్నాడు. ఈ మొత్తంతో, అతను ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.

అయితే, శ్రేయాస్ అయ్యర్ గంటకు ఎంత సంపాదిస్తున్నాడు? ఈ వివరాలు తెలుసుకోవాలని చాలామంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఐపీఎల్ 2025లో అయ్యర్ పొందుతున్న రూ.26.75 కోట్ల మొత్తాన్ని గ్రూప్ దశలోని 14 మ్యాచ్‌ల సమయానికి భాగిస్తే, ఒక గంటలో అతని ఆదాయాన్ని మనం అంచనా వేయవచ్చు.

ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్ 3 గంటలు అయినా, 14 మ్యాచ్‌లకు 42 గంటలు పడుతుంది. ఇప్పుడు మనం రూ.26.75 కోట్లను ఆ 42 గంటలతో భాగిస్తే, అయ్యర్ సంపాదన ఒక గంటలో మనకు వస్తుంది.

IPL 2025 లో 26.75 కోట్లు సంపాదించిన శ్రేయాస్ అయ్యర్..  గంటకు 63 లక్షల 69 వేల 50 రూపాయలు సంపాదిస్తాడు.

శ్రేయాస్ అయ్యర్ ఒక ఆటగాడు మాత్రమే కాదు. IPL 2025లో పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ కూడా. గతంలో కేకేఆర్‌కు ట్రోఫీ అందించినట్టే, ఈసారి పంజాబ్‌ను విజేతగా నిలిపేందుకు చూస్తున్నాడు.

ఇప్పటివరకు శ్రేయాస్ అయ్యర్ IPL 2025లో పంజాబ్ కింగ్స్ తరపున ఈ రెండు పాత్రల్లోనూ ఆకట్టుకుంటున్నాడు. ముందుముందు ఏం జరుగుతుందో చూడాలి.