AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Benefits: వేసవిలో శరీరం చల్లాగా ఉండేందుకు ఈ యోగాసనాలు ట్రై చేయండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం..

వేసవి కాలం వచ్చేసింది. ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం రకరకాల పద్దతులను అనుసరిస్తారు. దాహార్తిని తీర్చుకోవడానికి చల్లని పానీయాలు తాగుతారు. గదిని చల్లగా ఉంచేందుకు కూలర్, ఏసీ వంటి వాటిని ఏర్పాటు చేసుకుంటారు. అయితే శరీరం లోప నుంచి చల్లదనం ఉంచుకునేందుకు కూడా మార్గం ఉందని తెలుసా.. అదే యోగా. కొన్ని రకాల యోగాసనాలు వేయడం ద్వారా శరీరం చల్లగా ఉంటుంది. అవి ఏమిటంటే..

Yoga Benefits: వేసవిలో శరీరం చల్లాగా ఉండేందుకు ఈ యోగాసనాలు ట్రై చేయండి.. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం..
యోగా: యోగా చేయడం వలన ఫ్లెక్సిబిలిటీ మెరుగవుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగవుతాయి. యోగా చేయడం వల్ల శరీరానికి నూతనోత్సాహం కలుగుతుంది. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా వుండేట్లు చేస్తుంది. యోగా చేయడం వల్ల రక్తపోటు కూడా అదుపులో వుంటుంది. ఆరోగ్యకరమైన జీవితానికి యోగా ఎంతో సహాయపడుతుంది.
Surya Kala
|

Updated on: Apr 09, 2025 | 9:12 PM

Share

ఏప్రిల్ నెల ప్రారంభంలోనే ఎండలు మండుతున్నాయి. ప్రజల జీవితాలను దుర్భరం చేశాయి. డీహైడ్రేషన్ నుంచి కడుపు సమస్యల వరకు అనేక రకాల ఆరోగ్య సమస్యలు సామాన్యులను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం కోసం కొన్ని ప్రత్యేక చిట్కాలను పాటించండి. శరీరం చల్లగా ఉంచేందుకు కొన్ని రకాల యోగాసనాలు మంచి సహాయకారి. ఈ యోగాసనాలు చేయడం వలన మీరు మీ శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు అలాగే రోజంతా శక్తివంతంగా ఉండవచ్చు అని నిపుణులు చెప్పారు.

ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ శరీరం చల్లగా ఉండేందుకు ప్రజలు చల్లని పదార్థాలు తినడం ప్రారంభిస్తారు. కానీ యోగా ద్వారా శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చని మీకు తెలుసా? యోగా మన శరీరానికి మేలు చేయడమే కాదు మన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది, మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఈ విషయమే అందరికీ తెలుసు. కానీ యోగాసనాల ద్వారా శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. ఆ యోగాసనాలు ఏమిటో తెలుసుకుందాం..

ఈ యోగాసనల ద్వారా శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు

ఇవి కూడా చదవండి

శవాసనం: వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి.. మీరు ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో శవాసనం చేయవచ్చు. ఈ ఆసనం వేయడానికి చాప మీద నేరుగా పడుకోండి. మీ చేతులు, కాళ్ళు, నడుమును నిటారుగా ఉంచండి. కళ్ళు మూసుకుని 10-15 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది మీ మనసును ప్రశాంతపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. యోగా చేయడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది. కనుక ఈ శవాసనం పిల్లలతో సహా అందరికీ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

సింహా సన లేదా లయన్ పోజు: ఈ యోగాసనం ఉదయం ఖాళీ కడుపుతో చేస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గించడమే కాదు ఇది రక్త ప్రసరణను గణనీయంగా మెరుగుపరుస్తుంది. మీరు వేసవిలో ఈ యోగా చేస్తే శరీరాన్ని చల్లగా ఉంచడంలో చాలా వరకు సహాయపడుతుంది. దీని కోసం ముందుగా వజ్రాసన స్థితిలో కూర్చోండి. మీ వెన్నెముక , నడుమును నిటారుగా ఉంచండి. రెండు చేతులను మోకాళ్లపై ఉంచండి. ఒకేసారి గాలి పీల్చి వదలండి. మీరు దీన్ని 3-5 సార్లు చేస్తూ ఉండాలి. ఇది మీ శరీరం, మనస్సు రెండింటినీ ప్రశాంతంగా ఉంచుతుంది.

బద్ధ కోనాసన: ఈ బద్ధ కోనాసన యోగా కూడా వేసవిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీరంలో చల్లదనాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది. దీని మరో పేరు బటర్‌ఫ్లై పోజ్. దీన్ని చేయడానికి, ముందుగా మీ మోకాళ్లను వంచి, మీ మడమలను కటి వైపు ఉంచండి. రెండు అరికాళ్ళను కలిపి ఉంచండి. దీని తరువాత మీ రెండు చేతులతో రెండు పాదాల కాలి వేళ్లను పట్టుకోండి. ఈ స్థితిలో 2-5 నిమిషాలు ఉండండి. మీరు ఈ ఆసనాన్ని ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా చేయవచ్చు. అంతే కాదు ఇది ఒత్తిడి, అలసటను కూడా తగ్గిస్తుంది.

తాడాసనం: వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి తడసానా మంచిది. ఇది చేయడానికి మొదట మీరు మీ పాదాల మధ్య కొంచెం గ్యాప్ ఉంచుకుని నిలబడాలి. తరువాత మీరు మీ చేతులను మీ తలపైకి తీసుకుని మీ శరీరాన్ని వంచాలి. ఇలా 2-3 నిమిషాలు చేయవచ్చు. ఈ యోగాసనం చేయడం వలన సోమరితనం పోతుంది. ఒత్తిడిని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. తడసానాలో ఉన్న గొప్పదనం ఏమిటంటే, దీన్ని చేయడం వల్ల మీరు రోజంతా ఉత్సాహంగా, తాజాగా ఉంటారు. ఇది మాత్రమే కాదు రక్త ప్రసరణ కూడా గణనీయంగా మెరుగుపడుతుంది. ఈ యోగాను ఎప్పుడైనా చేయవచ్చు.

చంద్రభేది ప్రాణాయామం: చంద్రభేది ప్రాణాయామం అనేది చల్లని శ్వాసకు ఒక ప్రత్యేక సాంకేతికత. దీని ద్వారా మీరు మీ శరీరాన్ని చల్లగా ఉంచుకోవచ్చు. ఈ యోగాసనంలో ఎడమ ముక్కు రంధ్రం ద్వారా గాలిని పీల్చుకుంటారు. కుడి నాసికా రంధ్రం నుంచి విడుదల చేస్తారు. ఈ యోగా శరీరానికి శక్తినిచ్చేదిగా పనిచేస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచడమే కాదు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)