పాండ్యా విశ్వరూపం స్డేడియంలో సిక్సర్ల వర్షం
విజయ్ హజారే ట్రోఫీలో హార్దిక్ పాండ్యా చండీగఢ్‌పై 31 బంతుల్లో 75 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. 9 సిక్సర్లతో బరోడాకు భారీ స్కోరు అందించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో 19 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న పాండ్యా, న్యూజిలాండ్ సిరీస్, రాబోయే ప్రపంచకప్‌కు తన ఫామ్‌ను కొనసాగించే సూచనలిచ్చాడు.
విజయ్ హజారే ట్రోఫీలో భారత్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చెలరేగిపోయారు.రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో చండీగఢ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపిస్తూ ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం 31 బంతుల్లోనే 75 పరుగులు చేసి, బరోడా జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలిచిన బరోడా జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. కేవలం 11 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన ప్రియాన్షు మోలియాతో కలిసి పాండ్యా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. 6వ నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన హార్దిక్, మొదట్లో కాస్త నిదానంగా ఆడినా, కుదురుకున్నాక మాత్రం బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 19 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఆడిన ఈ మెరుపు ఇన్నింగ్స్‌లో మొత్తం 9 భీకరమైన సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. అంటే 75 పరుగుల్లో 62 పరుగులు కేవలం బౌండరీల రూపంలోనే వచ్చాయి. గత మ్యాచ్‌లో విదర్భపై 68 బంతుల్లోనే 133 పరుగులు చేసిన పాండ్యా, అదే ఊపును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. త్వరలో ప్రారంభం కానున్న న్యూజిలాండ్ సిరీస్‌లో హార్దిక్ ఇదే జోరును కొనసాగిస్తే ఆ జట్టకు జట్టుకు తిప్పలు తప్పవు. జనవరి 21 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. హార్దిక్ ఇదే ఫామ్‌లో ఉంటే ప్రపంచకప్‌లో టీమిండియాకు తిరుగుండదు. గత వరల్డ్‌కప్‌లోనూ హార్దిక్ టీమిండియాను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. మరో బాదుడుకు రంగం సిద్ధం
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే
సంక్రాతికి దూసుకొస్తున్న తుఫాన్.. ఏపీలో ఆ జిల్లాలకు అలెర్ట్!
‘ఆధార్’ అక్రమాలకు అడ్డుకట్ట.. కొత్త డిజిటల్ యాప్ వచ్చేసింది
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే..
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు..
స్కూళ్లలో ప్రతి శనివారం డ్యాన్స్‌లే..!
దిష్టిబొమ్మగా పెద్ద కళ్ళ మహిళ !! ఇంతకీ ఎవరీమె ??
ఛీ.. వీడు మనిషేనా ?? తల్లికి అనారోగ్యంగా ఉందని సెలవు అడిగితే
రూ.4 చోరీ కేసులో.. 51 ఏళ్లకు తీర్పు
మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్ వీడియో
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా

