ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్ విజ్ఞప్తి
ఇండోనేషియన్ మోడల్ మనోహర ఒడెలియా మలేషియా యువరాజుతో తన బాల్య వివాహం ఒక పీడకల అని ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. 16 ఏళ్ల వయసులో జరిగిన ఆ బంధాన్ని చట్టబద్ధమైన వివాహంగా అంగీకరించడం లేదని, 'మాజీ భార్య' అనే పదాన్ని తన విషయంలో వాడొద్దని మీడియాను కోరారు. తనను మైనర్‌గా వివాహం చేసుకున్నారని, తన స్వేచ్ఛను కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
మలేసియా యువరాజుతో తన వివాహం ఒక పీడకల అని ఓ మోడల్ ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు. తన గురించి ప్రస్తావించేప్పుడు ‘మాజీ భార్య’ అనే పదాన్ని ఉపయోగించడాన్ని ఆమె మీడియాను తప్పుపట్టారు. 2008లో మలేసియా యువరాజు టెంగ్ కు ఫఖ్రీ ని ఇండోనేసియన్-అమెరికన్ మోడల్ మనోహర ఒడెలియా వివాహం చేసుకున్నారు. అప్పుడు ఆ యువరాజు వయసు 31 ఏళ్లు ఆమె వయసు 16 ఏళ్లు. ఆ పెళ్లి అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. వివాహం తర్వాత నుంచి తనపై నిఘా పెరిగిందని, తల్లిదండ్రులతో కూడా మాట్లాడే పరిస్థితి లేకపోయిందని, తనను ఏనాడు మనిషిలా కూడా చూడలేదని గతంలో ఒడెలియా ఆరోపించారు. ఫఖ్రీ తండ్రికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో 2009లో ఆ రాజ కుటుంబం సింగపూర్‌కు వెళ్లింది. అక్కడే యూఎస్ ఎంబసీ, స్థానిక అధికారులు, తల్లి సహాయంతో సింగపూర్ హోటల్ నుంచి ఇండొనేసియా పారిపోయారామె. ఆ తర్వాత వారి బంధానికి ముగింపు పడింది. దాని గురించి ఆమె తాజాగా ఇన్‌స్టా వేదికగా స్పందించారు. ప్రస్తుతం ఆమె వయసు 33 ఏళ్లు. తన టీనేజ్‌లో ఏర్పడింది చట్టబద్ధమైన బంధం కాదనీ తను కోరుకున్నదీ కాదనీ అప్పుడు తను మైనర్‌ని అనీ తనకు కావాల్సింది ఎంచుకొనే వయసు, స్వేచ్ఛ లేవనీ ఆమె పోస్ట్‌లో రాసుకొచ్చారు. చట్టబద్ధమైన వివాహంలో మాజీ భార్య అనే పదం సరైందేననీ కానీ తనకు జరిగింది బాల్య వివాహమని కొన్నాళ్లుగా తన విషయంలో ఆ పదాన్ని వాడుతున్నారనీ అది వాస్తవాన్ని వక్రీకరిస్తుందనీ తనను ప్రస్తావించేటప్పుడు ఆ పదం వాడొద్దని ఇండోనేసియా మీడియాను కోరుతున్నట్లు ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఆధార్’ అక్రమాలకు అడ్డుకట్ట.. కొత్త డిజిటల్ యాప్ వచ్చేసింది
అర్ధరాత్రి బాల్కనీలో చిక్కుకుపోయిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే..
సంక్రాంతికి లగ్జరీ కారవాన్‌లో జాలీ ట్రిప్.. ఏపీ టూరిజం స్పెషల్ ప్యాకేజీ రెడీ
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

