శీతకాలం వచ్చిందంటే వెచ్చదనం కోసం కాఫీ, టీలు తెగ తాగేస్తుంటాం. దీంతో బరువు అమాంతం పెరిగిపోతుంటాం. అయితే ఈ కాలంలో బ్రోకలీతో తేలిగ్గా బరువుకు చెక్ పెట్టొచ్చని నిపుణులు అంటున్నారు
TV9 Telugu
చూసేందుకు క్యాలీఫ్లవర్ మాదిరి ఉండే బ్రోకలీ కాస్త ఖరీదు ఎక్కువే. అందుకు తగ్గట్టు పోషకాలూ అధికంగా ఉంటాయి. అందుకే దీన్ని ఏదో రూపంలో తరచూ తినాలి
TV9 Telugu
బ్రోకలీ రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటూ బరువునీ తగ్గిస్తుంది. ఇందులో కెలోరీలు తక్కువగా, పీచుపదార్థం ఎక్కువగా ఉండి ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది
TV9 Telugu
బ్రోకలీలో ఎ, బి6, బి9, సి, ఇ, కె విటమిన్లు, పీచు, రిబోఫ్లేవిన్, థియామిన్, పొటాషియం, జింక్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, భాస్వరం, సెలీనియం విస్తారంగా ఉంటాయి
TV9 Telugu
విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి జీర్ణక్రియనూ, జీవక్రియనూ మెరుగుపరుస్తాయి. ఈ పోషకాలు రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుతాయి
TV9 Telugu
బ్రోకలీ తరచూ తీసుకుంటే గుండెజబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇందులో గ్లూకోసినోలేట్లు, ఫినోలిక్ యాంటీఆక్సిడెంట్లు ఉండటంవల్ల శరీరంలో కొవ్వు, లిపిడ్‌లు పేరుకోకుండా చేస్తాయి
TV9 Telugu
నీటిశాతం కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆహారం తక్కువగా తీసుకుంటారు. జీర్ణప్రక్రియ సాఫీగా ఉంటుంది. వేళకు ఆకలి వేస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది
TV9 Telugu
మెదడు చురుగ్గా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉంటాయి. కంటిచూపు మెరుగుపడుతుంది. దీనితో కూర, ఫ్రై, ఛాట్, సూప్, పాస్తా, సలాడ్, ఆమ్లెట్, పరోటా, పకోడీ ఎలా తీసుకున్నా మంచిదే