AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదా అసలు మ్యాటర్.. కిడ్నీల్లో రాళ్ళు ఎందుకు వస్తాయో తెలుసా..? మర్చిపోయి కూడా ఇలా చేయకండి..

శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి.. కిడ్నీలు శరీరంలోని అనేక ముఖ్యమైన విధుల్ని నిర్వహిస్తాయి. రక్తాన్ని శుభ్రపర్చడం, శరీరం నుంచి టాక్సిన్లు తొలగించడం, అదనపు ద్రవాల్ని ఫిల్టర్ చేయడం లాంటి విధులను మూత్రపిండాలు నిర్వహిస్తాయి. అయితే.. ప్రస్తుత కాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం సర్వసాధారణం అయిపోయింది.

ఇదా అసలు మ్యాటర్.. కిడ్నీల్లో రాళ్ళు ఎందుకు వస్తాయో తెలుసా..? మర్చిపోయి కూడా ఇలా చేయకండి..
Kidney Stones Diet Tips
Shaik Madar Saheb
|

Updated on: Apr 10, 2025 | 12:03 PM

Share

శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి.. కిడ్నీలు శరీరంలోని అనేక ముఖ్యమైన విధుల్ని నిర్వహిస్తాయి. రక్తాన్ని శుభ్రపర్చడం, శరీరం నుంచి టాక్సిన్లు తొలగించడం, అదనపు ద్రవాల్ని ఫిల్టర్ చేయడం లాంటి విధులను మూత్రపిండాలు నిర్వహిస్తాయి. అయితే.. ప్రస్తుత కాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం సర్వసాధారణం అయిపోయింది. చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కాల్షియం, యూరిక్ యాసిడ్ లేదా ఆక్సలేట్ వంటి కొన్ని ఖనిజాలు మన శరీరంలో అధికంగా పేరుకుపోయి మూత్రం ద్వారా సరిగ్గా బయటకు రాలేనప్పుడు.. అవి క్రమంగా పేరుకుపోయి చిన్న చిన్న గట్టి గడ్డలుగా ఏర్పడతాయి.. ఇవి క్రమంగా రాళ్లుగా మారుతాయి.

మూత్రపిండంలో రాయి ఉంటే.. రోగి నడుము, కడుపు లేదా మూత్ర నాళంలో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తాడు. కొన్నిసార్లు వాంతులు, వికారం లేదా మూత్ర విసర్జన సమయంలో మంట వంటి సమస్యలు కూడా మొదలవుతాయి. మరికొన్నిసార్లు, మూత్రపిండంలో రాయి ఉంటే.. రోగి భరించలేని నొప్పిని అనుభవించడం ప్రారంభిస్తాడు. కిడ్నీల్లో రాళ్లు ఉంటే.. నొప్పి తరచుగా రాత్రి సమయంలో వస్తుంది. దీనిలో, రోగికి తినాలనే కోరిక కూడా కలగదు.. మూత్రపిండాల్లో రాళ్లు ఎలా, ఎందుకు ఏర్పడతాయి..? దానిని ఎలా నియంత్రించవచ్చు..? నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ వివరాలను తెలుసుకోండి..

మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటానికి కారణాలు..

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో అతి పెద్ద కారణం తక్కువ నీరు త్రాగడం. శరీరానికి తగినంత నీరు అందనప్పుడు, మూత్రం చిక్కగా మారుతుంది.. దానిలో ఖనిజాలు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీనితో పాటు, ఉప్పు, టీ, చాక్లెట్, పాలకూర వంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. కుటుంబంలో ఎవరికైనా గతంలో రాళ్ల సమస్య ఉంటే, జన్యుపరమైన కారణాల వల్ల ఇతరులు కూడా దీనితో బాధపడవచ్చు.. కొంతమందికి తరచుగా మూత్ర ఇన్ఫెక్షన్లు ఉంటాయి.. ఇది రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

వైద్యులు ఏం చెబుతున్నారంటే..

మూత్రపిండాల్లో రాళ్ల గురించి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ హిమాన్షు వర్మ మాట్లాడుతూ.. మూత్రపిండాల్లో రాళ్లను యురోలిథియాసిస్ లేదా మూత్రపిండ కాలిక్యులి అని కూడా అంటారు. వాటి పరిమాణం ఇసుక కణం నుండి గోల్ఫ్ బంతి పరిమాణం వరకు ఉంటుంది. శరీరంలోని టాక్సిన్స్ సరిగ్గా బయటకు రాలేక, కాల్షియం రూపంలో మూత్రపిండాలలో పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు, రాళ్ళు ఏర్పడతాయి. ఈ వ్యాధిని సులభంగా నివారించవచ్చు. మీ ఆహారం, జీవనశైలిని మెరుగుపరచడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. అలాగే నీటి పరిమాణాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజూ 8 గ్లాసుల నీరు త్రాగడం, చక్కెర, ఉప్పు తక్కువగా తీసుకోవడం.. ప్రతిరోజూ వ్యాయామం చేయడం అవసరం.. అని తెలిపారు.

మూత్రపిండాల్లో రాళ్లను ఎలా నివారించవచ్చు?

కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటే.. మూత్రపిండాల్లో రాళ్లను నివారించవచ్చు. పుష్కలంగా నీరు త్రాగాలి. ప్రతిరోజూ 8 నుండి 10 గ్లాసుల నీరు త్రాగండి.. తద్వారా శరీరంలోని మురికి బయటకు వెళుతుంది. మీ ఆహారాన్ని సమతుల్యంగా.. తేలికగా ఉంచండి.. తక్కువ ఉప్పు తీసుకోండి.. అధిక ప్రోటీన్ ఆహారాలు తినండి. బయటి ఫాస్ట్ ఫుడ్ లేదా ప్యాక్ చేసిన పదార్థాలకు దూరంగా ఉండండి. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట లేదా నొప్పి గురించి మీకు తరచుగా ఫిర్యాదులు ఉంటే, ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి. మూత్ర విసర్జనను ఎప్పుడూ ఆపకండి.. లేకుంటే ఇన్ఫెక్షన్ – రాళ్ళు రెండూ సంభవించవచ్చు..

కిడ్నీ స్టోన్స్ ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుందంటే..

మీకు కిడ్నీలో రాళ్లు ఉంటే, చికిత్స కోసం డాక్టర్‌ను సంప్రదించటం చాలా ముఖ్యం.. ఆ తర్వాత వాళ్లు చెప్పిన విధంగా చికిత్స పొందాలి.. చిన్న రాళ్లు సాధారణంగా కిడ్నీల నుంచి వెళ్లిపోతాయి.. కానీ పెద్ద రాళ్లకు చికిత్స అవసరం కావచ్చు. చికిత్సలో నొప్పి నివారణ మందులు, ఎక్కువ నీరు త్రాగడం, లేదా శస్త్రచికిత్స వంటివి ఉండవచ్చు.. కావున వైద్యులను సంప్రదించండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.