Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paneer vs Tofu: పనీర్ లేదా టోఫు? ఆరోగ్యానికి ఏది మంచిది.. బరువు తగ్గాలంటే ఏది తినాలంటే

పనీర్ ప్లేస్ లో కొంతమంది టోఫుని కూడా ఉపయోగిస్తారు. దీనితో కూడా ఆహారపదార్ధాలు తయారు చేస్తారు. అయితే పనీర్ లేదా టోఫు ఆరోగ్యానికి మంచిదా అనేది తరచుగా ప్రజల మదిలో తలెత్తే ప్రశ్న. రెండింటిలోనూ పోషకాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ, రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే.. దేనిని ఎంచుకోవాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ రోజు  టోఫు లేదా పనీర్ ఏది మంచిదనే విషయం తెలుసుకుందాం..  పనీర్ అని పిలువబడే తాజా ఉప్పు లేని జున్ను భారతీయ వంటల్లో ప్రధానమైనది. సోయా పాలతో తయారు చేసే జున్నుని సోయా పనీర్ లేదా టోఫు అని పిలుస్తారు

Paneer vs Tofu: పనీర్ లేదా టోఫు? ఆరోగ్యానికి ఏది మంచిది.. బరువు తగ్గాలంటే ఏది తినాలంటే
Paneer Vs Tofu
Follow us
Surya Kala

|

Updated on: Mar 09, 2024 | 1:22 PM

ప్రపంచంలోనే భారతీయులు ఆహార ప్రియులు అని పేరు.. రకరకాల వంటలను రుచికరంగా తయారు చేస్తారు. అలాంటి వంటకాల్లో అనేక రకాలు ప్రపంచ ప్రసిద్దిగాంచినవి కూడా ఉన్నాయి. వాటిల్లో పన్నీర్ తో తయారు చేసిన ఆహార పదార్ధాలు కూడా ఉన్నాయి. అయితే పనీర్ పాలను విరగొట్టి తయారు చేస్తారు. దీనితో బిర్యానీ, కూరలు వంటి అనేక రకాల వంటలు చేస్తారు. పనీర్ ప్లేస్ లో కొంతమంది టోఫుని కూడా ఉపయోగిస్తారు. దీనితో కూడా ఆహారపదార్ధాలు తయారు చేస్తారు. అయితే పనీర్ లేదా టోఫు ఆరోగ్యానికి మంచిదా అనేది తరచుగా ప్రజల మదిలో తలెత్తే ప్రశ్న. రెండింటిలోనూ పోషకాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ, రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే.. దేనిని ఎంచుకోవాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ రోజు  టోఫు లేదా పనీర్ ఏది మంచిదనే విషయం తెలుసుకుందాం..

పనీర్ అని పిలువబడే తాజా ఉప్పు లేని జున్ను భారతీయ వంటల్లో ప్రధానమైనది. సోయా పాలతో తయారు చేసే జున్నుని సోయా పనీర్ లేదా టోఫు అని పిలుస్తారు

ఎందులో పోషకాలు ఎక్కువంటే

పనీర్ ను ఆవు లేదా గేదె పాల నుంచి తయారు చేస్తారు. అయితే సోయా పాలను టోఫు చేయడానికి ఉపయోగిస్తారు. రెండూ ఆరోగ్యానికి మంచివే  యితే ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకుందాం…

ఇవి కూడా చదవండి

జున్ను ..  టోఫు రెండింటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అయితే టోఫులో చీజ్ కంటే ఎక్కువ ఐరన్ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఇనుము లోపం ఉన్నవారు లేదా రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులు ఖచ్చితంగా తినే ఆహారంలో టోఫును చేర్చుకోవాలి.

ప్రోటీన్లు

శాకాహారులకు పుష్కలంగా ప్రోటీన్లు పొందడానికి పనీర్ తింటారు. ఎందుకంటే పనీర్ ఆవు లేదా గేదె పాలతో తయారు చేస్తారు. దీని కారణంగా టోఫు కంటే ఎక్కువగా పనీర్ లో ప్రోటీన్లు ఉంటాయి. ఎవరైనా జిమ్‌కి వెళ్లేవారు.. లేదా కండరాలను పెంచుకోవాలనుకుంటే తినే ఆహారంలో ఖచ్చితంగా జున్ను చేర్చుకోండి. పనీర్ ఎముకలు, కండరాలను బలపరుస్తుంది.

ఆరోగ్యకరమైన కొవ్వులు

ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే పనీర్ కంటే టోఫు బెస్ట్ ఎంపిక. ఎందుకంటే టోఫులో చీజ్ కంటే తక్కువ కొవ్వు ఉంటుంది. కనుక జున్ను బదులుగా టోఫును తినే ఆహారంలో చేర్చుకోవాలి. అటువంటి పరిస్థితిలో    టోఫుతో అనేక రకాల వంటకాలను తయారు చేయవచ్చు. బరువు తగ్గించే ఆహారంలో చేర్చుకోవచ్చు.

క్యాలరీలు

శరీరానికి కావలిసిన కేలరీలు అందించడానికి టోఫు లేదా పనీర్ ఏది బెస్ట్ అని కొందరు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే పనీర్ లో తక్కువ కేలరీలు ఉన్నాయని ప్రజల నమ్మకం. దీని కారణంగా ఇది ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. అయితే ఇది అస్సలు నిజం కాదు. టోఫులో జున్ను కంటే తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి ఎవరైనా బరువు తగ్గాలనుకుంటే టోఫును ఎంచుకోండి . అదే సమయంలో శరీరాన్ని  నిర్మించాలనుకుంటే పనీర్ ఎంచుకోండి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)