Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: చెవుల్లో అదో రకం సౌండ్స్ వినిపిస్తున్నాయా..? సమస్య ఇదే..

మారిన జీవనశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల అధిక రక్తపోటు భారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అధిక రక్తపోటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణంగా మారుతోంది. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌కు ప్రధాన కారణం అధిక రక్తపోటేనని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటను కొన్ని లక్షణాల...

Health: చెవుల్లో అదో రకం సౌండ్స్ వినిపిస్తున్నాయా..? సమస్య ఇదే..
Different Noises
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 09, 2024 | 7:14 PM

శరీరంలో వచ్చే అనారోగ్య సమస్యలను ముందుగానే కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చని నిపుణులు చెబుతుంటారు. శరీరం మన ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు మనల్ని అలర్ట్‌ చేస్తూనే ఉంటుంది. కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా శరీరంలో వచ్చే అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. అలాంటి కొన్ని లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మారిన జీవనశైలి, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల అధిక రక్తపోటు భారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అధిక రక్తపోటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు కారణంగా మారుతోంది. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌కు ప్రధాన కారణం అధిక రక్తపోటేనని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటను కొన్ని లక్షణాల ఆధారంగా ముందుగానే గుర్తించవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* అధిక రక్తపోటు ఉన్న వారికి ముందుగా కనిపించే లక్షణాల్లో ముక్కు నుంచి రక్తస్రావం రావడం ప్రధాన లక్షణంగా చెప్పొచ్చు. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు, ముక్కు సిరలపై ఒత్తిడి పడుతుంది దీంతో అవి పగిలిపోతాయి. దీని కారణంగా ముక్కు నుంచి రక్తం బయటకు వస్తుంది. ముక్కు నుంచి రక్తం రావడం అధిక రక్తపోటుకు లక్షణంగా భావించాలి. అధిక రక్తపోటును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

* అధిక రక్తపోటు వచ్చిన సమయంలో కనిపించే మరో ప్రధాన లక్షణం తలనొప్పి. ఎవరికైనా అధిక రక్తపోటు వచ్చిన వెంటనే మొదటగా తలనొప్పి వస్తుంది. తలనొప్పి కొన్ని సందర్భాల్లో తలకు ఓవైపు వస్తే మరికొందరిలో తల మొత్తం నొప్పి వస్తుంది. అధిక రక్తపోటు కారణంగా మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులపై ఒత్తిడి ఏర్పడి తలనొప్పి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తలనొప్పిని లైట్‌ తీసుకోకుండా వెంటనే బీపీ చెక్‌ చేసుకోవాలి.

* హైబీపీ ఉన్న వారిలో కనిపించే మరో ప్రధాన లక్షణం తల తిరగడం. శరీరంలో రక్తపోటు స్థాయి పెరిగినప్పుడు మెదడుకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులపై ఒత్తిడి ఏర్పడుతుంది. దీని కారణంగా మెదడులో తగినంత రక్తప్రసరణ జరగదు, దీంతో కళ్లు తిరగడం మొదలువుతుంది. తీవ్రమైన మైకం కారణంగా వ్యక్తి పడి పోయే ప్రమాదం ఉంటుంది.

* ఇక అధిక రక్తపోటు వచ్చిన సమయాల్లో కొందిరికీ చెవుల్లో వింత శబ్ధాలు వినిపిస్తాయి. కొందరికి చెవుల్లో రింగింగ్ లేదా శబ్దాలు వినిపిస్తాయి. అధిక రక్తపోటు కారణంగా, చెవి ధమనులలో రక్తం వేగంగా ప్రవహిస్తుంది ఈ కారణంగానే చెవుల్లో వింత శబ్ధాలు వినిపిస్తాయి. పైన తెలిపిన లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..