ఈ ఆయుర్వేద ఔషధం సహాయం తీసుకోండి: తిప్పతీగలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. తీప్పతీగ ఆకుల నుంచి వేర్ల వరకు ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.. అందుకే తిప్పతీగతో తిప్పలు దూరం అంటారు పెద్దలు.. అలాంటి తిప్పతీగ సహాయంతో, శరీరంలోని అనేక రకాల సమస్యలను నయం చేయవచ్చు. ఇది పురుషుల ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. ఈ మొక్కలో గిలోయిన్ అనే గ్లూకోసైడ్, టెనోస్పోరిన్, పామరిన్, టెనోస్పోరిక్ యాసిడ్ ఉంటాయి. ఇది కాకుండా, భాస్వరం, రాగి, ఇనుము, జింక్, మాంగనీస్, కాల్షియం కూడా తిప్పతీగలో పెద్ద మొత్తంలో లభిస్తాయి. అందుకే పెళ్లయిన పురుషులు ఇలాంటి సహజమైన ఔషధాలను తీసుకుంటే.. రోమాంటిక్ లైఫ్ ను ఎంజాయ్ చేయవచ్చు అంటున్నారు.