- Telugu News Photo Gallery Cinema photos Three huge controversial movies are coming this season in one week Gap
Controversy Movies: ఈ సినిమాలు సమ్మర్ వేడిని మరింతా పెంచనున్నాయా.? నిజం ఎంత.?
దారిన పోయే వివాదాన్ని ఎవరైనా ఇంటికి పిలుస్తారా చెప్పండి..? కానీ పిలుస్తున్నారు.. మన ఇండస్ట్రీలో కొందరు దర్శకులు అలాంటి కాంట్రవర్సీ ఉన్న కథల్నే ఎంచుకుంటున్నారు.. వివాదం ఉన్న సినిమాలనే చేస్తున్నారు. ఈ సీజన్‌లో మూడు భారీ కాంట్రవర్షియల్ మూవీస్ వచ్చేస్తున్నాయి. వాటి గురించి దేశమంతా మాట్లాడుకుంటున్నాయి. మరింతకీ ఏంటా వివాదాస్పద సినిమాలు..?
Updated on: Mar 09, 2024 | 12:11 PM

మరుగున పడిన చరిత్రను చూపిస్తున్నాం.. ఈ మధ్య కాంట్రవర్సీ సినిమాలు చేసే ఏ దర్శకుడిని అడిగినా చెప్తున్న సమాధానమిదే. మార్చి 15న విడుదల కానున్న రజాకార్‌పై కూడా ఎన్నో వివాదాలు రేగుతున్నాయి. ఇందులో ముస్లింలను తప్పుగా చూపిస్తున్నారంటూ ఇప్పటికే నిరసనలు మొదలయ్యాయి.

గతేడాది కేరళ స్టోరీతో సంచలనం సృష్టించిన దర్శకుడు సుదీప్తో సేన్. లవ్ జీహాద్ నేపథ్యంలో వచ్చిన కేరళ స్టోరీ ఏకంగా 250 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం చాల ప్రాంతాల్లో బ్యాన్ చేసారు. అయినప్పటికీ బ్లాక్ బస్టర్ అందుకుంది.

ఇప్పుడు బస్తర్ అంటూ మరో కాంట్రవర్సల్ చిత్రంతో వస్తున్నారు. అప్పట్లో బస్తర్ జిల్లాలోని సుక్మాలో నక్సలైట్స్ దాడిలో 76 మంది జవాన్లు చనిపోయారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ విషయాన్నే బస్తర్‌లో చూపిస్తున్నారు సుదీప్తో సేన్. ట్రైలర్ చూస్తుంటే మరో కాంట్రవర్సీ ఖాయంగానే కనిపిస్తుంది.

బాలీవుడ్‌లో బస్తర్ తో పాటు వీర్ సావర్కర్‌పై కూడా చర్చ బాగానే జరుగుతుంది. భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులలో ఒకరైన వినాయక్ దామోదర్ సావర్కర్ బయోపిక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రణ్‌దీప్ హూడా. ఈ చిత్రంలో టైటిల్ రోల్ ఆయనే చేస్తున్నారు.

ఈ మూడు వివాదాస్పద సినిమాలు వారం గ్యాప్‌లో వస్తున్నాయి. హైదరాబాద్ నేపథ్యంలో రజాకర్, హిందీలో బస్తర్ మార్చి 15న వస్తుంటే.. వీర్ సావర్కర్ మార్చి 22న ప్రేక్షకులు ముందుకు రానుంది. మరి చూడాలి ఈ మూడు చిత్రాలు ఎలాంటి వివాదాలకు దారి తియ్యనున్నాయో.




