- Telugu News Photo Gallery Cinema photos Prabhas Kalki 2898 AD and Gopichand Bhimaa latest Film Updates from Tollywood Film Industry
Film Updates: డార్లింగ్ ఫ్యాన్స్ కి మహాశివరాత్రి గిఫ్ట్.. భీమా రెస్పాన్స్..
కల్కి షూటింగ్ చివరిదశకు వచ్చింది. ఇది రెండు భాగాలుగా వస్తుందని ప్రచారం జరుగుతుంది.. దీనిపై యూనిట్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది. విశ్వక్ సేన్, చాందిని చౌదరి జంటగా విద్యాధర్ తెరకెక్కించిన సినిమా గామి. అప్పట్లో ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేసిన శర్వానంద్.. రెండేళ్లుగా కనిపించట్లేదు. గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కించిన చిత్రం భీమా.
Updated on: Mar 09, 2024 | 12:43 PM

కల్కి షూటింగ్ చివరిదశకు వచ్చింది. ఇది రెండు భాగాలుగా వస్తుందని ప్రచారం జరుగుతుంది.. దీనిపై యూనిట్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది. ఇటలీలో ప్రభాస్, దిశా పటానీపై సాంగ్ చిత్రీకరిస్తున్నారు నాగ్ అశ్విన్. ఈ పాట కోసమే భారీగా ఖర్చు పెడుతున్నారు నిర్మాతలు. ఈ షెడ్యూల్‌తో కల్కి షూటింగ్ దాదాపు పూర్తైపోయినట్లే.

తాజాగా శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా ప్రభాస్ పాత్ర పేరును రివీల్ చేసారు మేకర్స్. ఇందులో డార్లింగ్ భైరవగా అలరించనున్నారు. దీనికి సంబంధించి ఓ పోస్టర్ కూడా విడుదల చేసారు మేకర్స్. ఇది చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. పాన్ వరల్డ్ స్థాయిలో మే 9న అనేక భాషల్లో విడుదల కానుంది ఈ చిత్రం.

విశ్వక్ సేన్, చాందిని చౌదరి జంటగా విద్యాధర్ తెరకెక్కించిన సినిమా గామి. ఈ సినిమా మార్చి 8న సినిమా విడుదల అయింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్టోరీ ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజ్ చేసింది. కొంత లగ్ సీన్స్ కూడా ఉన్నాయి. దింతో ఈ సినిమాపై డివైడింగ్ టాక్ వచ్చింది.

గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు హర్ష తెరకెక్కించిన చిత్రం భీమా. మార్చి 8న శివరాత్రి సందర్బంగా విడుదలైంది ఈ చిత్రం. A సర్టిఫికేట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చికుంది. పరశురామ క్షేత్రంలో ఈ సినిమా కథ సాగింది. చాలరోజుల తర్వాత గోపీచంద్ హిట్ అందుకున్నారనే చెప్పాలి.

అప్పట్లో ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేసిన శర్వానంద్.. రెండేళ్లుగా కనిపించట్లేదు. తాజాగా ఈయన మూడు సినిమాలు ప్రకటించారు. అందులో శ్రీరామ్ ఆదిత్య సినిమా ఇప్పటికే సెట్స్‌పై ఉండగా.. యువీ క్రియేషన్స్‌లో ఓ సినిమా.. సామజవరగమనా ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు శర్వానంద్.




