- Telugu News Photo Gallery Cinema photos Suhas Prasanna Vadanam to Premalu Movie Review latest Film Updates from Tollywood
Movie Updates: మరో భిన్నమైన కాన్సెప్టుతో సుహాస్.. తెలుగు ప్రేమలు టాక్..
కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్. గీతా ఆర్ట్స్‌లో కొత్త వాళ్లకు ఎప్పుడూ అవకాశాలు ఇస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే కొత్త దర్శకుడు అంజి తెరకెక్కిస్తున్న సినిమా ఆయ్. దేశభక్తి కథాంశంతో చదలవాడ శ్రీనివాసరావు తెరకెక్కించిన సినిమా ‘రికార్డ్ బ్రేక్’. కేరింత ఫేమ్ పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా వస్తున్న సినిమా ‘మార్కెట్ మహాలక్ష్మి’. సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భగవాన్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ప్రేమలు.
Updated on: Mar 09, 2024 | 10:40 AM

కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజి బ్యాండు లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్. ఇప్పుడు ఈయన మరో భిన్నమైన కాన్సెప్టుతో వస్తున్నారు. తాజగా ఈయన నటిస్తున్న ప్రసన్న వదనం టీజర్ విడుదలైంది. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొత్త దర్శకుడు అర్జున్ దీన్ని తెరకెక్కిస్తున్నారు.

గీతా ఆర్ట్స్‌లో కొత్త వాళ్లకు ఎప్పుడూ అవకాశాలు ఇస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే కొత్త దర్శకుడు అంజి తెరకెక్కిస్తున్న సినిమా ఆయ్. మేం ఫ్రెండ్సండి టాగ్ లైన్. తారక్ బావమరిది నార్నె నితిన్, హారిక ఇందులో జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల చేసారు. సమ్మర్‌లో విడుదల కానుంది ఆయ్ సినిమా.

దేశభక్తి కథాంశంతో చదలవాడ శ్రీనివాసరావు తెరకెక్కించిన సినిమా ‘రికార్డ్ బ్రేక్’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తుందంటూ చెప్పుకొచ్చారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు దర్శకుడు చదలవాడ. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ జరిగింది. ఇందులో సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలు తెలిపారు.

కేరింత ఫేమ్ పార్వతీశం, ప్రణీకాన్వికా జంటగా వస్తున్న సినిమా ‘మార్కెట్ మహాలక్ష్మి’. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు రెస్పాన్స్ బాగుందన్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ సినిమా నుంచి సాఫ్ట్‌వేర్ పోరగా అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేసారు. త్వరలోనే సినిమా విడుదల కానుంది.

సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, అఖిల భగవాన్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ప్రేమలు. గిరీష్ ఈ సినిమాను తెరకెక్కించారు. మళయాళంలో ఇప్పటికే బ్లాక్‌బస్టర్ అయింది ప్రేమలు. తెలుగులో ఈ సినిమాను మార్చి 8న తెలుగులో విడుదల అయింది. అయితే కంటెంట్‌పై నమ్మకంతో ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ వేశారు దర్శక నిర్మాతలు. తెలుగులో కూడా ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది.




