- Telugu News Photo Gallery Cinema photos Why Bollywood big budget movies are released directly on OTT
Bollywood: బాలీవుడ్ మేకర్స్ సేఫ్ గేమ్ ఆడేస్తున్నారా..? దానికి కారణమేంటి..?
కరోనా నుంచి బాలీవుడ్ ఇంకా బయటపడలేదా..? లేదంటే థియేటర్స్‌లోకి వచ్చిన తర్వాత కలెక్షన్లు రావట్లేదని ముందుగానే సేఫ్ గేమ్ ఆడేస్తున్నారా..? భారీ బడ్జెట్ పెడుతున్నా.. షాహిద్ కపూర్, వరుణ్ ధావన్ లాంటి స్టార్స్ సినిమాలో ఉన్నా ఎందుకింకా ఓటిటిలోనే నేరుగా సినిమాలు విడుదల చేస్తున్నారు..? దానికి కారణమేంటి..? ఇదంతా నిర్మాతల స్ట్రాటజీలోనే భాగమేనా..?
Updated on: Mar 09, 2024 | 9:25 AM

ప్రపంచమంతా కరోనా నుంచి బయటపడింది ఒక్క బాలీవుడ్ తప్ప. అదేంటి అలా అంటున్నారు.. ఇంకెక్కడి కరోనా అనుకోవచ్చు..! కానీ బాలీవుడ్ దర్శక నిర్మాతల ఆలోచన ఇంకా అక్కడే ఆగిపోయింది. అందుకే 2024లోనూ కొన్ని సినిమాలు నేరుగా ఓటిటిలోనే విడుదలవుతున్నాయి. తాజాగా సారా అలీ ఖాన్ ఏ వతన్ మేరే వతన్ కూడా అలాగే వస్తుంది. కరణ్ జోహార్ ఈ సినిమాకు నిర్మాత.

ప్రీ ఇండిపెండెన్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఏ వతన్ మేరే వతన్‌లో స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌తో పాటు చాలా మంది స్టార్ క్యాస్ట్ ఉన్నా.. ఈ సినిమాని థియేటర్స్ కాకుండా మార్చి 21న అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఓటిటిలో నేరుగా విడుదల చేస్తున్నారు.

ఆ మధ్య బాలీవుడ్ స్టార్ క్యాస్ట్ ప్రధాన పాత్రల్లో నటించిన షాహిద్ కపూర్ బ్లడీ డాడీ.. సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను.. వరుణ్ ధవన్ భవాల్.. ఇషాన్ ఖట్టర్ పిప్పా లాంటి పెద్ద సినిమాలు కూడా థియేటర్స్ కాకుండా ఓటిటిలోనే రిలీజ్ చేసారు బాలీవుడ్ మేకర్స్.

స్టార్ హీరోలకే ఈ పరిస్థితి వస్తుందంటే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాల గురించి చెప్పనక్కర్లేదు. హిందీలో టాప్ హీరోయిన్స్ నటించిన సినిమాల్ని సైతం నేరుగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లంటే బడా ఓటిటికి ఇచ్చేస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు.

బాలీవుడ్ నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ అంటే ఉన్న భయంతోనే.. నేరుగా డిజిటల్ వైపు అడుగులేస్తున్నారు. ఇది మంచిది కాదని.. దీనివల్ల థియేట్రికల్ బిజినెస్ భారీగా పడిపోతుందని బాలీవుడ్ సినిమాల బయ్యర్లు గోల పెడుతున్నారు. మరి వీరి సమస్యకు పరిస్కారం దొరుకుతుందా.?




