AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: మధ్యాహ్నం నిద్ర మంచిదా.? కాదా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

భోజనం చేసిన తర్వాత కనీసం 10 నిమిషాలు నిద్రపోతే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు అదుపులో ఉంటుంది. హృదయ సంబంధిత శస్త్రచికిత్సలు చేసుకున్న వారికి మధ్యాహ్నం నిద్రపోవడం ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు...

Lifestyle: మధ్యాహ్నం నిద్ర మంచిదా.? కాదా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Afternoon Sleep
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 09, 2024 | 3:06 PM

మధ్యాహ్నం నిద్ర మనలో చాలా మందికి ఉండే అలవాటు. మధ్యాహ్నం కాసేపైనా కునుకు తీయాలని భావిస్తుంటారు. అయితే మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదా.? కాదా.? అన్న అనుమానం మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది. ఇంతకీ మధ్యాహ్నం నిద్ర మనిషి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

భోజనం చేసిన తర్వాత కనీసం 10 నిమిషాలు నిద్రపోతే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు అదుపులో ఉంటుంది. హృదయ సంబంధిత శస్త్రచికిత్సలు చేసుకున్న వారికి మధ్యాహ్నం నిద్రపోవడం ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి. మధుమేహం, పీసీఓడీ, థైరాయిడ్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అనారోగ్యంతో బాధపడుతున్నవారు త్వరగా కోలుకోవడానికి మధ్యాహ్నం కునుకు ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే నిపుణుల అభిప్రాయం ప్రకారం మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే పడుకోకూడదని చెబుతున్నారు. కనీసం 20 నిమిషాలు నడిచిన తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి. అలాగే గంటలతరబడి కాకుండా కేవలం 30 నిమిషాలు నిద్రపోవాలని చెబుతున్నారు. ఇక వృద్ధులు, అనారోగ్యంతో బాధపడే వారు లేదా చిన్న పిల్లలు 1.5 గంటల వరకు నిద్రపోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య నిద్ర మంచిదని చెబుతున్నారు.

ఇక సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య నిద్ర ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే టీ, కాఫీ, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండడమే ఉత్తమం అని చెబుతున్నారు. అలాగే అన్నం తిన్న వెంటనే కాసేపు అటుఇటు నడవాలని చెబుతున్నారు. ఇక మధ్యాహ్నం 30 నిమిషాల కంటే ఎక్కువ నిద్రించడం ఏమాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..