Watermelon Seeds Tea: పుచ్చకాయ తిని.. గింజలు పడేస్తున్నారా.. వాటితో టీ చేసి తాగితే ప్రయోజనాలెన్నో..!

పుచ్చకాయ గింజలను సేకరించి వాటిని ఎండబెట్టి చూర్ణం చేసి నిల్వ చేసుకోండి.  పుచ్చకాయ గింజల టీ తయారీకి గిన్నె తీసుకుని లీటర్ నీరు వేసి.. అందులో కొంచెం పుచ్చకాయ గింజల పొడిని వేసి బాగా మరగబెట్టండి. అందులో కొంచెం నెయ్యి, నిమ్మకాయని పిండి తాగండి. ఇలా వరసగా మూడు రోజులు తాగిన తర్వాత  మళ్ళీ ఒక్క రోజు పుచ్చకాయ గింజల టీకి సెలవు ఇచ్చి మళ్ళీ మొదలు పెట్టండి. ఈ టీని తాగడం వలన షుగర్ పేషేంట్స్ కు షుగర్ అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది. 

Watermelon Seeds Tea: పుచ్చకాయ తిని.. గింజలు పడేస్తున్నారా.. వాటితో  టీ చేసి తాగితే ప్రయోజనాలెన్నో..!
Watermelon Seeds
Follow us

|

Updated on: Feb 22, 2024 | 10:44 AM

వేసవి కాలం మొదలైంది. భానుడి భగభగలు మొదలవుతున్నాయి. దీంతో శరీరం తేమగా ఉంచుకోవడానికి దాహార్తిని తీర్చుకోవడనికి పుచ్చకాయని తినడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తారు. పుచ్చకాయ ఎండవేడి నుంచి ఉపశమం ఇస్తుంది. అయితే పుచ్చకాయ తిని గింజలను పడేస్తారు చాలా మంది. అయితే పుచ్చకాయ గింజలు డ్రైఫ్రూట్స్ లో ఒకటి అని మీకు తెలుసా.. ఈ గింజలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో పుచ్చకాయ గింజలతో టీ తయారు చేసుకుని తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

వాస్తవానికి పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో దాహాన్ని తీర్చడమే కాదు.. శరీరం డీహైడ్రేషన్‌ బారిన పడకుండా మంచి ఉపశమనం ఇస్తుంది. శరీరం తేమగా ఉండేలా చూస్తుంది. పుచ్చకాయలో పాటు పుచ్చ గింజల నీరు లేదా టీ తో అనేక పోషకాలు దొరుకుతాయి.

పుచ్చకాయ గింజల నీరు

పుచ్చకాయ గింజలను శుభ్రంగా కడిగి నీటిలో వేసి .. ఉడకబెట్టండి. ఈ నీరులో అనేక ఔషధగుణాలున్నాయి. రోజు తాగడం వలన శరీరంలోని ఖనిజాలు, విటమిన్లు లభిస్తాయి. సీజనల్ వ్యాధులను నయం చేస్తాయి.

ఇవి కూడా చదవండి

పుచ్చకాయ గింజల టీ తయారీ

పుచ్చకాయ గింజలను సేకరించి వాటిని ఎండబెట్టి చూర్ణం చేసి నిల్వ చేసుకోండి.  పుచ్చకాయ గింజల టీ తయారీకి గిన్నె తీసుకుని లీటర్ నీరు వేసి.. అందులో కొంచెం పుచ్చకాయ గింజల పొడిని వేసి బాగా మరగబెట్టండి. అందులో కొంచెం నెయ్యి, నిమ్మకాయని పిండి తాగండి. ఇలా వరసగా మూడు రోజులు తాగిన తర్వాత  మళ్ళీ ఒక్క రోజు పుచ్చకాయ గింజల టీకి సెలవు ఇచ్చి మళ్ళీ మొదలు పెట్టండి. ఈ టీని తాగడం వలన షుగర్ పేషేంట్స్ కు షుగర్ అదుపులో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది.

 పుచ్చకాయ గింజల టీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

గుండె ఆరోగ్యానికి: మీ హృదయం ఆరోగ్యంగా ఉండడం కోసం పుచ్చకాయ గింజల నీరు బెస్ట్ అప్షన్. ఈ నీటిని క్రమం తప్పకుండా తాగడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గింజల్లో ఉండే మెగ్నీషియం గుండెను రక్షిస్తుంది.

స్కిన్ కేర్ కోసం : ఈ గింజల నీరుని తాగడం వలన అందమైన చర్మం మీ సొంతం. వీటిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెరిసే స్కిన్ మీ సొంతం.

బలమైన జుట్టు కోసం: ఒత్తైన జుట్టుకు పుచ్చకాయ గింజల నీరు మంచి మంచి సహాయకారి. జుట్టు డ్యామేజ్, స్కాల్ప్ దురదను నివారిస్తుంది. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు స్కిన్ ముడతలు లేకుండా చేస్తాయి.

బీపీ అదుపులో ఉంచుకోవడానికి: పుచ్చకాయ గింజల్లో అమైనో ఆమ్లాలు అధికంగా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను పెంచుతాయి. దీనిలో కాలిష్యం ఎముకలు, కణజాలాలను బలోపేతం చేస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి.  రక్త నాళాలు సంకుచితం కాకుండా చేస్తాయి.

పుచ్చకాయ గింజల్లో విటమిన్ బి, బి6, నియాసిన్, ఫోలేట్, థైమెన్, పాంతోతేనిక్ యాసిడ్లు అధికంగా ఉన్నాయి. దీనిలో ఉన్న నియాసిన్ నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. దీనిలోని పోషకాలు,  ప్రోటీన్లు  శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.