Fish Biryani Recipe: సీ ఫుడ్ ప్రియులా.. మీకు ఇష్టమైనవారి కోసం ఇంట్లోనే టేస్టీ టేస్టీగా చేపల బిర్యానీని అందించండి ఇలా..

ముందుగా చేప ముక్కలను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ కడిగి నీరు లేకుండా మరో గిన్నెలోకి ఒప్పుకోవాలి. అంతేకాదు కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి దానిమీద బాణలి పెట్టి కొంచెం నూనె వేయాలి. వేడి ఎక్కిన తర్వాత జీలకర్ర వేసి వేయించి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టులు వేసి వేయించుకుని ధనియాల పొడి, పసుపు, కారం, కొంచెం ఉప్పు, గరం మాసాల పొడి, పెరుగు వేసి వేయించుకుని కొంచెం కొత్తిమీర తరుగు, పచ్చి మిర్చి , బిర్యానీ మసాలా వేసి కలుపుకుని ఈ మిశ్రమంలో చేప ముక్కలు వేసి వేయించుకోవాలి. 

Fish Biryani Recipe: సీ ఫుడ్ ప్రియులా.. మీకు ఇష్టమైనవారి కోసం ఇంట్లోనే టేస్టీ టేస్టీగా చేపల బిర్యానీని అందించండి ఇలా..
Fish Biryani
Follow us
Surya Kala

|

Updated on: Feb 22, 2024 | 11:10 AM

రోజు ఇదేనా అంటూ తినడానికి పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా అనుకుంటారు. దీంతో రెస్టారెంట్ వైపు దృష్టి సారిస్తారు. అక్కడకు వెళ్లిన తరువాత ఆర్డర్ పెట్టె ఆహారంలో ముందు ప్లేస్ లో ఉండేది బిర్యానీ. సీఫుడ్ ప్రియులు ఐతే చేపల బిర్యానీని తినడానికి ఆసక్తిని చూపిస్తారు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లోనే చేపలతో టేస్టీ టేస్టీ బిర్యానీని తయారు చేసుకోవచ్చు. తయారీ కూడా చాలా ఈజీ.. ఈ రోజు ఫిష్ బిర్యానీ తయారీ విధానం ఏమిటో తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు

  1. పండుగప్ప చేప ముక్కలు – ఒక కిలో
  2. బాస్మతి రైస్ – రెండు కప్పులు
  3. ఉల్లి పాయ కట్ చేసిన ముక్కలు
  4. పచ్చిమిర్చి – మూడు
  5. ఇవి కూడా చదవండి
  6. బిర్యానీ మసాలా – ఒక స్పూను
  7. అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు స్పూన్లు
  8. గరం మసాలా – ఒక స్పూను
  9. జీలకర్ర – ఒక స్పూను
  10. ధనియాల పొడి – ఒక స్పూను
  11. లవంగాలు – నాలుగు
  12. మిరియాలు- నాలుగు
  13. దాల్చిన చెక్క – ఒక ముక్క
  14. యాలకులు- నాలుగు
  15. పెరుగు – ఒక కప్పు
  16. పసుపు – అర స్పూను
  17. ఉప్పు – రుచికి సరిపడా
  18. కారం – ఒక స్పూను
  19. కుంకుమపువ్వు – కొంచెం
  20. కొత్తిమీర తరుగు
  21. నీళ్లు – సరిపడా
  22. పాలు – పావు కప్పు
  23. నెయ్యి- కొంచెం
  24. నూనె, – తగినంత

చికెన్ బిర్యానీ తయారీ విధానం: ముందుగా చేప ముక్కలను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత బాస్మతి రైస్ కడిగి నీరు లేకుండా మరో గిన్నెలోకి ఒప్పుకోవాలి. అంతేకాదు కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి దానిమీద బాణలి పెట్టి కొంచెం నూనె వేయాలి. వేడి ఎక్కిన తర్వాత జీలకర్ర వేసి వేయించి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టులు వేసి వేయించుకుని ధనియాల పొడి, పసుపు, కారం, కొంచెం ఉప్పు, గరం మాసాల పొడి, పెరుగు వేసి వేయించుకుని కొంచెం కొత్తిమీర తరుగు, పచ్చి మిర్చి , బిర్యానీ మసాలా వేసి కలుపుకుని ఈ మిశ్రమంలో చేప ముక్కలు వేసి వేయించుకోవాలి.

ఇప్పుడు బిర్యానీ తయారీకి కావాల్సినంత దళసరి గిన్నె పెట్టుకుని అందులో  మూడు కప్పుల నీరు పోసి ఆ నీటిలో మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరగనిచ్చి అందులో కడిగి పక్కకు పెట్టుకున్న రైస్ ను వేసి ఉడికించాలి. సగం కంటే ఎక్కువ ఉడికిన తర్వాత ఇప్పడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలను మిశ్రమాన్ని పొరలు పొరలుగా అమర్చుకోవాలి. ఈ బిర్యానీ రైస్ మీద కుంకుమ పువ్వు పాలను వేసి చిన్నగా మిక్స్ చేసి మూత పెట్టుకోవాలి. సుమారు 20 నిముషాలు ఉడికించుకోవాలి. అంటే టేస్టీ టేస్టీ ఫిష్ బిర్యానీ రెడీ..

ఈ బిర్యానీని చేప ముక్కలతో కలిపి తినవచ్చు.. లేదంటే రైతా తో కూడా తినవచ్చు. అయితే చేపల బిర్యానీని సర్వ్ చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా ప్లేట్ లోకి తీసుకోవాలి. లేదంటే చేప ముక్క విడిపోయే అవకాశం ఉంది. సో డిఫరెంట్ టెస్ట్ ఫుడ్ కోసం రెస్టారెంట్ కు వెళ్ళేబదులు ఇంట్లోనే సింపుల్ గా టేస్టీగా ఫిష్ బిర్యానీ తయారు చేసుకోండి.. మీ ప్రియమైనవారికి అందించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..