Gayatri Mantra: గాయత్రీ మంత్ర ప్రాముఖ్యత.. పఠించడానికి సరైన సమయం.. ఎన్నిసార్లు జపించాలో తెలుసా..

గాయత్రీ మంత్రం అనేది ఋగ్వేదంలోని ఒక శ్లోకం. ఇది పురాతన గ్రంథాలలో ఒకటి. ఈ మంత్రాన్ని జపించే మనిషి సరైన మార్గంలో నడవడానికి, మరింత స్పష్టంగా, ఏకాగ్రతతో ఉండటానికి సహాయపడుతుంది. గాయత్రీ మంత్రాన్ని పఠించడం ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఇంకా, గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల వ్యక్తిని శుద్ధి చేయడమే కాకుండా, ఆ వ్యక్తి చుట్టూ సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అలాగే భక్తితో, సరైన ఉచ్ఛారణతో జపిస్తేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. 

Gayatri Mantra: గాయత్రీ మంత్ర  ప్రాముఖ్యత..  పఠించడానికి సరైన సమయం.. ఎన్నిసార్లు జపించాలో తెలుసా..
Gayatri Mantra
Follow us
Surya Kala

|

Updated on: Feb 22, 2024 | 7:24 AM

గాయత్రీ మంత్రం హిందూమతంలో అత్యంత ప్రసిద్ధ, పురాతన మంత్రాల్లో ఒకటి. మంత్రాలను పఠించడం అనేది ధ్యానానికి చెందిన ముఖ్యమైన రూపం. అయితే వాటిని రోజువారీ అభ్యాసంగా కూడా ఉపయోగించవచ్చు. ప్రత్యేకించి లక్ష్యాన్ని సాధించడానికి అదనపు శక్తి అవసరమైనప్పుడు గాయత్రీ మంత్రం మరింత శక్తినిస్తుంది. ఈ మంత్రం ఋగ్వేదంలో వివరించబడిన అన్ని వేద మంత్రాల సారాంశంగా పరిగణించబడుతుంది. భారతదేశంలో ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలలో, ఉదయం సమావేశాలలో గాయత్రీ మంత్రాన్ని చేర్చడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గాయత్రీ మంత్రం మూడు సాంప్రదాయిక భాగాలను కలిగి ఉంటుంది. సూర్య నమస్కారం, మంగళకరమైన దీవెనలు, సార్వత్రిక సత్యం  వ్యక్తీకరణ.

గాయత్రీ మంత్రం:

ఓంభుర్ భువః స్వః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.||

గాయత్రీ మంత్రం సార్వత్రిక ప్రార్థనగా పరిగణించబడుతుంది. ఈ మంత్రం ఆధ్యాత్మిక వృద్ధిని, జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. దీన్ని రోజూ పారాయణం చేయడం వల్ల భౌతిక పురోగతి సాధించవచ్చని చెబుతారు. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా వ్యక్తిగత పరివర్తన ఏర్పడుతుంది. అన్ని ప్రయత్నాలలో విజయం లభిస్తుంది. గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల మీ జీవితంలోని ప్రతికూల పరిస్థితులను మార్చే శక్తిని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

గాయత్రీ మంత్రం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మంత్రంగా పరిగణించబడుతుంది. ఈ మంత్రం ఒక వ్యక్తి జీవితాన్ని మెరుగుపరచడంలో కూడా చాలా శక్తివంతమైనదని చెప్పబడింది. ఈ మంత్రాన్ని పఠిస్తే.. ఏదైనా కోరిక నెరవేరుతుందని, జీవితంలోని ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని నమ్ముతారు. గాయత్రీ మంత్రాన్ని అన్ని మంత్రాలకు తల్లి అని కూడా పిలుస్తారు. దీనిని పఠించడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ శక్తివంతమైన మంత్రాన్ని పఠించడం ద్వారా సంపద, ఆరోగ్యం, ఉద్యోగం మొదలైన వాటిని పొందడంలో విజయం సాధిస్తారు.

గాయత్రీ మంత్రం అనేది ఋగ్వేదంలోని ఒక శ్లోకం. ఇది పురాతన గ్రంథాలలో ఒకటి. ఈ మంత్రాన్ని జపించే మనిషి సరైన మార్గంలో నడవడానికి, మరింత స్పష్టంగా, ఏకాగ్రతతో ఉండటానికి సహాయపడుతుంది. గాయత్రీ మంత్రాన్ని పఠించడం ఆధ్యాత్మిక శక్తిని మేల్కొల్పడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఇంకా, గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల వ్యక్తిని శుద్ధి చేయడమే కాకుండా, ఆ వ్యక్తి చుట్టూ సానుకూల శక్తి వ్యాపిస్తుంది. అలాగే భక్తితో, సరైన ఉచ్ఛారణతో జపిస్తేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి.

గాయత్రీ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి?

గాయత్రీ మంత్రాన్ని ఎన్నిసార్లు అయినా జపించవచ్చు. గాయత్రీ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి అనేది వ్యక్తి , అతని అవసరాలపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఈ మంత్రాన్ని ప్రతిరోజూ కొన్ని సార్లు జపిస్తారు.మరికొందరు రోజుకు ఒకసారి మాత్రమే జపిస్తారు. గాయత్రీ మంత్రాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా జపించవచ్చు, అయితే ఉదయం పూట జపించడం ఉత్తమం.

గాయత్రీ మంత్రం ఎవరికి అంకితం చేయబడిందంటే

గాయత్రీ మంత్రం సృష్టిలోని స్త్రీ శక్తికి అంకితం చేయబడింది. ఇది మొత్తం సృష్టికి తల్లి అయిన ఆది శక్తి స్వరూపంగా పిలుస్తారు. ఆమె విశ్వ శక్తి ప్రతి కణంలో ఉంది. మీకు అధిక ప్రయోజనం కావాలంటే ప్రతిరోజూ కనీసం 108 సార్లు ఈ మంత్రాన్ని పఠించాలి. ఒకేసారి ఇన్నిసార్లు మంత్రాన్ని జపించలేకపోతే.. ఐదు, పది ఇలా క్రమంగా సంఖ్యను పెంచుకోవచ్చు.

గాయత్రీ మంత్రాన్ని జపించడానికి ఉత్తమ సమయం?

ముఖ్యంగా ‘బ్రహ్మ ముహూర్తం’ సమయంలో ఉదయాన్నే గాయత్రీ మంత్రాన్ని జపించడం ఉత్తమంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల దాని శక్తి, ప్రభావం పెరుగుతుంది. అలాగే ఉదయం ప్రశాంతమైన వాతావరణంలో జపించడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది.  అందుచేత ఉదయాన్నే జపించడం ఉత్తమమని చెబుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు