Medaram Jatara: నేడు వనం నుంచి జనం మధ్యకు సమ్మక్క ఆగమనం.. అధికారిక లాంఛనాలతో స్వాగతం చెప్పడానికి ఏర్పాట్లు..

ఈ జాతరలో అతి ముఖ్యమైన ఘటం ఈరోజు ఆవిష్కృతం కానుంది.. చిలకలగుట్ట నుండి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు..ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం చిలకలగుట్టపై పూజలు నిర్వహించి అక్కడినుండి గద్దెల పైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు. అయితే సమ్మక్క రాక సందర్భంగా జిల్లా ఎస్పీ 10 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి అధికారిక లాంచనాలతో సమ్మక్క దేవతకు స్వాగతం పలకడం ఇక్కడ ఆనవాయితీ.

Medaram Jatara: నేడు వనం నుంచి జనం మధ్యకు సమ్మక్క ఆగమనం.. అధికారిక లాంఛనాలతో స్వాగతం చెప్పడానికి ఏర్పాట్లు..
Medaram Jatara
Follow us
G Peddeesh Kumar

| Edited By: Surya Kala

Updated on: Feb 22, 2024 | 6:59 AM

లక్షలాదిమంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.. మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే గడియలు వచ్చేశాయి. బుధవారం రాత్రి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనం పూర్తయింది. ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి కాన్నేపల్లి నుండి సారలమ్మ ను, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి గోవిందరాజు ప్రతిరూపాలను తీసుకు వచ్చి గద్దెలపై ప్రతిష్టించారు.

ఇక ఈ జాతరలో అతి ముఖ్యమైన ఘటం ఈరోజు ఆవిష్కృతం కానుంది.. చిలకలగుట్ట నుండి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు..ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం చిలకలగుట్టపై పూజలు నిర్వహించి అక్కడినుండి గద్దెల పైకి తీసుకొచ్చి ప్రతిష్టిస్తారు.

అయితే సమ్మక్క రాక సందర్భంగా జిల్లా ఎస్పీ 10 రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి అధికారిక లాంచనాలతో సమ్మక్క దేవతకు స్వాగతం పలకడం ఇక్కడ ఆనవాయితీ. జిల్లా కలెక్టర్ ఎదురెళ్లి సమ్మక్క పూజారులకు పట్టు వస్త్రాలు సమర్పించి వారికి స్వాగతం పలుకుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి పూజారులకు స్వాగతం పలకడం జాతరలో కొనసాగుతున్న ఆనవాయితీ. సమ్మక్క ను గద్దెల పైకి తీసుకు రావడం కోసం మూడంచెల పోలీసు భద్రతతో ప్రత్యేక రోప్ పార్టీని సిద్ధం చేశారు.. ఇప్పటికే రెండుసార్లు మాక్ డ్రిల్ నిర్వహించారు.

ఇవి కూడా చదవండి

అయితే సారలమ్మ ను కాక వంశీయుల చేతుల మీదుగా తీసుకురాగా. సమ్మక్కను సిద్దబోయిన వంశీయుల చేతుల మీదుగా తీసుకొస్తారు. ఈ కార్యక్రమంలో చందా వంశీయులు, మేడారం గ్రామస్తుల తో పాటు ఆదివాసీలు అంతా పాల్గొని డోలి వాయిద్యాలు, ఆదివాసి ఆచార సంప్రదాయాలతో సమ్మక్కను ఉత్సాహంగా, ఊరేగింపుగా తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు.

ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు లక్షలాదిమంది భక్తులు ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు.. ఇప్పటికే మేడారం పరిసరాలన్ని జనంతో కిక్కిరిసిపోయాయి.. చుట్టూ పది కిలోమీటర్ల నిడివితో ఎటు చూసినా మేడారం వనం మొత్తం జనసంద్రంగా మారిపోయింది.. వివిధ మార్గాల్లో మేడారం చేరుకున్న భక్తులంతా సమ్మక్క ఆగమనం కోసం ఎదురు చూస్తున్నారు.. సమ్మక్క – సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువు దీరిన తర్వాత మొక్కులు చెల్లించుకొని తిరుగు ప్రయాణం అవుతారు. సమ్మక్క ఆగమనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.. స్థానిక మంత్రి ఆదివాసి బిడ్డ సీతక్క అన్నీ తానై జాతర నిర్వహిస్తున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..