Jagannath Temple: మన దేశంలో అనేక రహస్య ఆలయాలు.. జగన్నాథ దేవాలయం ఎందుకు ప్రత్యేకమంటే
పురాణాల ప్రకారం విష్ణువు చార్ ధామ్‌లో స్థిరపడిన సమయంలో మొదట బద్రీనాథ్ కు చేరుకున్నారు. అక్కడ స్నానం చేసాడు. ఆ తర్వాత గుజరాత్ వెళ్లినప్పుడు అక్కడ బట్టలు మార్చుకున్నాడు. తరువాత భగవంతుడు ఒడిశాలోని పూరీకి చేరుకున్నాడు.. ఇక్కడ ఆహారం తీసుకున్నాడు.. చివరకు విష్ణువు తమిళనాడులోని రామేశ్వరం చేరుకున్నాడు. అక్కడ విష్ణువు విశ్రాంతి తీసుకున్నాడు. హిందూ మతంలో భూలోక వైకుంఠంగా పిలువబడే పురిలోని జగన్నాథుడు ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది.
ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథ దేవాలయం భారతదేశంలోని అత్యంత ‘మర్మమైన’ దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధి. ఈ ఆలయం అత్యంత పురాతన ఆలయం. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నేటికీ జగన్నాథ దేవాలయంలోని విగ్రహంలో శ్రీ కృష్ణుని హృదయం కొట్టుకుంటుందని మత విశ్వాసం. ఈ ఆలయానికి సంబంధించిన అనేక అపరిష్కృత రహస్యాలు ఉన్నాయి. వీటి గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. అయితే ఈ రహస్యాలు పౌరాణిక కథలలో ప్రస్తావించబడ్డాయి.
పురాణ కథల ప్రకారం హిందూ మతంలో వైష్ణవ సంప్రదాయంలో జగన్నాథ దేవాలయం అతిపెద్ద తీర్థయాత్రగా పరిగణించబడుతుంది. జగన్నాథుని దర్శనం కోసం ప్రతిరోజూ దేశ విదేశాల నుండి వేలాది మంది యాత్రికులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. పూరీలోని ఈ ఆలయం కృష్ణ భగవానుడికి అంకితం చేయబడింది. ఇక్కడ స్వామివారిని జగన్నాథుడు అని పిలుస్తారు.
హిందూమతంతో సంబంధం ఉన్న నాలుగు ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటైన పూరీలోని ఈ ఆలయంలో, జగన్నాథునితో పాటు, అతని అన్న బల రాముడు, సోదరి సుభద్ర విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఈ ఆలయానికి సంబంధించి అనేక కథలు ఉన్నాయని విశ్వాసం. అవి నేటి వరకు రహస్యంగా ఉన్నాయి. ఈ గుడి మీదుగా ఏ విమానం కూడా ఎగరదని, పక్షులు కూడా ఎగరాలంటే భయపడతాయని చెబుతారు.
జగన్నాథుడి పూజ: పురాణాల ప్రకారం విష్ణువు చార్ ధామ్‌లో స్థిరపడిన సమయంలో మొదట బద్రీనాథ్ కు చేరుకున్నారు. అక్కడ స్నానం చేసాడు. ఆ తర్వాత గుజరాత్ వెళ్లినప్పుడు అక్కడ బట్టలు మార్చుకున్నాడు. తరువాత భగవంతుడు ఒడిశాలోని పూరీకి చేరుకున్నాడు.. ఇక్కడ ఆహారం తీసుకున్నాడు.. చివరకు విష్ణువు తమిళనాడులోని రామేశ్వరం చేరుకున్నాడు. అక్కడ విష్ణువు విశ్రాంతి తీసుకున్నాడు. హిందూ మతంలో భూలోక వైకుంఠంగా పిలువబడే పురిలోని జగన్నాథుడు ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ శ్రీ కృష్ణ భగవానుడు తన అన్నా చెల్లలు ,, బలరాముడు, సుభద్రలతో ప్రతిరోజూ ఆచారాలు నియమ నిష్టలతో పూజిస్తారు.
పూరీ ఆలయానికి సంబంధించిన అంతుచిక్కని రహస్యాలు ఇవే
- జగన్నాథ ఆలయంలో ప్రసాదం వండడానికి, 7 పాత్రలు ఒకదానిపై ఒకటి ఉంచుతారు. అందులో పైభాగంలో ఉంచిన పాత్రలోని ప్రసాదం మొదట వండుతారు. అయితే దిగువ నుంచి ప్రసాదం ఒకదాని తర్వాత ఒకటి వండుతారు. అందులోనే ఆశ్చర్యంగా ఉంది.
- పగటిపూట ఆలయంలోని గాలి సముద్రం నుండి భూమి వైపు వీస్తుంది. అయితే సాయంత్రం భూమి నుంచి సముద్రం వైపు గాలి వీస్తుంది. జగన్నాథుని ఆలయ శిఖరంపై ఉన్న జెండా గాలికి ఎదురుగా ఎప్పుడూ రెపరెపలాడుతుంది.
- జగన్నాథ దేవాలయం ఎత్తు దాదాపు 214 అడుగులు. అటువంటి పరిస్థితిలో జంతువులు, పక్షుల నీడ కనిపించాలి. అయితే ఈ ఆలయ శిఖర నీడ ఎప్పుడూ కనిపించదు.
- పూరిలో ఉన్న జగన్నాథ దేవాలయం మీదుగా ఏ విమానం గాని, ఏ పక్షి గాని ఎప్పుడూ గుడి శిఖరంపై నుంచి ఎగరదు. భారతదేశంలోని ఏ దేవాలయంలోనూ ఇలాంటి వింత కనిపించదు.
- జగన్నాథునితో సహా మూడు విగ్రహాలను ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఆలయంలో మారుస్తారు. ఆ తర్వాత అక్కడ కొత్త విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. దేవుడి విగ్రహాలను మార్చే సమయంలో నగరంలో అంధకారం నెలకొంటుంది. విద్యుత్ నిలిచిపోతుంది.
- ఈ సమయంలో ఆలయం వెలుపల భారీగా భద్రతా బలగాలను మోహరిస్తారు. ఆ సమయంలో పూజారి మాత్రమే ఆలయంలోకి ప్రవేశిస్తారు.
- ఆలయం పైభాగంలో ఒక టన్ను బరువున్న అదృష్ట చక్రం ఉంది. అద్భుతమైన వాస్తవం ఏమిటంటే, పూరిలో ఏ ప్రదేశంలోనైనా ఎత్తు నుండి చక్రాన్ని చూస్తే ఆ చక్రం తమవైపు చూస్తున్నట్లు దర్శనమిస్తుంది. దీనికి సంబంధించిన మరొక రహస్యమైన విషయం ఏమిటంటే 12వ శతాబ్దంలో అంత ఎత్తులో ఉన్న గుడి శిఖరంపై ఆ చక్రాన్ని ఎలా అమర్చారు అనేది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు