Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Polythene: శివపురి అడవుల్లో 200 పైగా ఆవుల మృత దేహాలు లభ్యం.. మరణాలకు కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు

ఈ వ్యవహారంపై విచారణ జరపాలని అధికార యంత్రాంగం ఆదేశాలను జారీ చేసింది. అడవిలో ఇన్ని ఆవులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అకస్మాత్తుగా ఇన్ని ఆవులు ఎలా చనిపోయాయి..? ఈ ఘటన వెనుక ఏదైనా పెద్ద కుట్ర దాగి ఉందా? ఈ ప్రశ్నలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, అధికారులు ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభించారు. జాతీయ రహదారి నెంబర్ 27పై కరైరా తహసీల్ గుండా సిల్లార్‌పూర్ రహదారికి హైవేకి 500 మీటర్ల దూరంలో ఉన్న అడవిలో ఆవుల మృతదేహాలు కనిపించాయి.

Polythene: శివపురి అడవుల్లో 200 పైగా ఆవుల మృత దేహాలు లభ్యం.. మరణాలకు కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు
Dead Body Of Cow
Follow us
Surya Kala

|

Updated on: Feb 18, 2024 | 6:19 PM

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం మధ్యాహ్నం కరైరా పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో 200 పైగా ఆవుల మృతదేహాలు కనిపించాయి. పట్టణ ప్రాంతంలో ఈ ఆవులు చనిపోయాయని, మృతదేహాలను అక్కడి నుంచి తీసుకెళ్లి ఇక్కడి అడవిలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అధికారుల నుంచి లేదా ఏ సామాజిక సంస్థ నుండి ఎటువంటి ఖచ్చితమైన సమాధానం రాలేదు. ప్రస్తుతం ఈ మృతదేహాలను చూసిన గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని అధికార యంత్రాంగం ఆదేశాలను జారీ చేసింది. అడవిలో ఇన్ని ఆవులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అకస్మాత్తుగా ఇన్ని ఆవులు ఎలా చనిపోయాయి..? ఈ ఘటన వెనుక ఏదైనా పెద్ద కుట్ర దాగి ఉందా? ఈ ప్రశ్నలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, అధికారులు ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభించారు. జాతీయ రహదారి నెంబర్ 27పై కరైరా తహసీల్ గుండా సిల్లార్‌పూర్ రహదారికి హైవేకి 500 మీటర్ల దూరంలో ఉన్న అడవిలో ఆవుల మృతదేహాలు కనిపించాయి.

మిస్టరీగా మారిన ఆవుల మృతి

గ్రామస్తుల కథనం ప్రకారం.. శుక్రవారం రాత్రి ఈ ఆవుల మృతదేహాలను నగరం నుంచి తీసుకొచ్చి అడవిలో పడేశారు. కరైరా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సురేష్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం సమాచారం అందుకున్న పోలీసు బృందాన్ని సంఘటనా స్థలానికి పంపారు. ఆవులు ఎలా చనిపోయాయి.. అది కూడా ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో ఆవుల మృతదేహాలు ఎలా చేరుకున్నాయన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు  ఈ ఆవుల మృతదేహాలను పట్టణ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడవేసినట్లు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఆవు కడుపులోంచి బయటకు వచ్చిన ప్లాస్టిక్ సంచులు

కాగా, చనిపోయిన ఆవుల కడుపులో నుంచి పాలిథిన్‌ బ్యాగ్స్ వచ్చినట్లు సిల్లార్‌ పుర పంచాయతీ సర్పంచ్‌ అరవింద్‌ లోధి తెలిపారు. ప్లాస్టిక్ తినడం వల్లే ఆవులు చనిపోయాయని చెప్పారు. చనిపోయిన తర్వాత పట్టణ ప్రాంతం నుంచి లారీల్లో తీసుకుని వచ్చి ఇక్కడ పడేసినట్లు తెలుస్తోంది. వాస్తవం ఏమైనప్పటికీ  ఈ సంఘటన శివపురిలోనే కాకుండా మొత్తం రాష్ట్రాన్ని భయాందోళనకు గురి చేసింది. అటువంటి పరిస్థితిలో  ప్రభుత్వం లేదా అధికారులు ఎలాంటి ప్రకటన జారీ చేయకుండా తప్పించుకుంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..