Mob attacked on Cop: అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం.. పోలీసులు, జర్నలిస్టులపై గ్రామస్థులు దాడి! ఏం జరిగిందంటే..

రెండు రోజుల క్రితం కనబడకుండా పోయిన మహిళ శవమై కనిపించింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై దాడికి తెగబడ్డారు. మహిళ కనబడకుండా పోయిన దాదాపు రెండు రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని వెలికితీసిన నేపథ్యంలో బీహార్‌లోని నవ్‌గాచియాలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో కొందరు వ్యక్తులు పోలీసులపై దాడి చేశారు. ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసు వాహనానికి..

Mob attacked on Cop: అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం.. పోలీసులు, జర్నలిస్టులపై గ్రామస్థులు దాడి! ఏం జరిగిందంటే..
Bihar Mob Attacked On Cop
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 18, 2024 | 5:44 PM

బీహార్‌, ఫిబ్రవరి 18: రెండు రోజుల క్రితం కనబడకుండా పోయిన మహిళ శవమై కనిపించింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసులపై దాడికి తెగబడ్డారు. మహిళ కనబడకుండా పోయిన దాదాపు రెండు రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని వెలికితీసిన నేపథ్యంలో బీహార్‌లోని నవ్‌గాచియాలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో కొందరు వ్యక్తులు పోలీసులపై దాడి చేశారు. ఆగ్రహించిన గ్రామస్థులు పోలీసు వాహనానికి నిప్పుపెట్టారు. న్యూస్‌ కవర్ చేయడానికి సంఘటనా స్థలానికి వచ్చిన జర్నలిస్టులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జర్నలిస్టులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

శోభాదేవి అనే మహిళ ఫిబ్రవరి 16వ తేదీ (శుక్రవారం)న పాలు అమ్మేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకుని ఉంటే ఆమె బ్రతికి ఉండేదని, పోలీసుల నిర్లక్ష్యం వల్లనే మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ పోలీసులపై స్థానికులు దాడి చేశారు. పదేపదే ఫిర్యాదు చేసినప్పటికీ వారు చర్య తీసుకోలేదని ఆగ్రహించారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ఆ ప్రాంతంలో పోలీసులు మోహరించారు. కేసుపై దర్యాప్తు ప్రారంభించామని, అనుమానితులను విచారిస్తున్నట్లు పోలీస్‌ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

కాగా గత ఏడాది ప్రారంభంలో బీహార్‌లోని నౌగాచియాలో నివాసి ఇంటిపై దాడి చేసిన పోలీసు సిబ్బందిపై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడి చేసిన సంగతి తెలిసిందే. బీహార్‌లోని నౌగాచియాలోని ఒక నివాసి ఇంటిపై దాడి చేస్తున్న పోలీసు సిబ్బందిపై గ్రామస్తుల బృందం దాడి చేసింది. బాధితుడి భార్య, బిడ్డపై దాడి చేయడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఈ మేరకు పోలీసు బృందంపై దాడి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ