గజరాజుల బీభత్సం.. వణికిపోతున్న కృష్ణగిరి జిల్లా

హోసూరు సమీప గ్రామాల ప్రజలకు గత కొన్ని రోజులుగా కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఏనుగుల గుంపు పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి. లేదంటే జనావాసాల్లోకి ఎంట్రీ ఇస్తూ భయపెడుతున్నాయి. ఇళ్లల్లోంచి బయటకు వెళ్లాలంటేనే వణికిపోయే పరిస్థితి. ఏనుగుల సంచారంపై చాలాసార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు.

గజరాజుల బీభత్సం.. వణికిపోతున్న కృష్ణగిరి జిల్లా
Elephants
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 18, 2024 | 4:00 PM

గజరాజుల బీభత్సానికి.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా గజగజ వణికిపోతుంది. ఏనుగుల గుంపు ఎటువైపు నుంచి.. ఎలా వచ్చి మీద పడి దాడి చేస్తాయోనని హోసూరు పరిసర ప్రాంతవాసులు హడలిపోతున్నారు. ఆవేశంతో ఉగిపోతూ ఘీంకారాలు చేస్తూ విచక్షణారహితంగా ఎటాక్ చేస్తుండటంతో జనం భయంగుప్పిట్లో బతుకీడుస్తున్నారు. కాపాడండి మహా ప్రభో అంటూ ఫారెస్ట్ అధికారుల్ని వేడుకుంటున్నారు.

హోసూరు సమీప గ్రామాల ప్రజలకు గత కొన్ని రోజులుగా కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఏనుగుల గుంపు పంటల్ని ధ్వంసం చేస్తున్నాయి. లేదంటే జనావాసాల్లోకి ఎంట్రీ ఇస్తూ భయపెడుతున్నాయి. ఇళ్లల్లోంచి బయటకు వెళ్లాలంటేనే వణికిపోయే పరిస్థితి. ఏనుగుల సంచారంపై చాలాసార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఊళ్లలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కానీ అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ఓ ఏనుగు బీభత్సానికి ఇద్దరు మహిళలు చనిపోయారు. మరో ముగ్గురు ఆస్పత్రి పాలయ్యారు.

ఇద్దరు మహిళలు చనిపోవడంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఫారెస్ట్ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఏనుగులు మనుషుల ప్రాణాలు తీస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. గంటలకొద్ది ప్రజలు నిరసన వ్యక్తం చేయడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చూడాలన్నారు. ఆందోళనతో దిగొచ్చిన అధికారులు.. ఏనుగులు జనావాసాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసనకారులు శాంతించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..