Madhya Pradesh: కమల్‌నాథ్ బీజేపీలో చేరితే.. 12 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటీ..?
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్ తన కుమారుడు నకుల్‌తో కలిసి బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాల మధ్య మధ్యప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్‌లో కూడా చీలికలు వస్తాయనే భయం నెలకొంది. కమల్‌నాథ్‌పై వస్తున్న ఊహాగానాలు నిజమైతే ఆయన సన్నిహిత ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వారు కూడా కమలనాథుల బాటలోనే పయనిస్తారా? లేదా కాంగ్రెస్‌తో ఉండిపోతారా..? అన్నదీ ఉత్కంఠగా మారింది.

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్ తన కుమారుడు నకుల్‌తో కలిసి బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాల మధ్య మధ్యప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్‌లో కూడా చీలికలు వస్తాయనే భయం నెలకొంది. కమల్‌నాథ్‌పై వస్తున్న ఊహాగానాలు నిజమైతే ఆయన సన్నిహిత ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వారు కూడా కమలనాథుల బాటలోనే పయనిస్తారా? లేదా కాంగ్రెస్‌తో ఉండిపోతారా..? అన్నదీ ఉత్కంఠగా మారింది.
కమల్‌నాథ్‌కు సన్నిహితంగా ఉండే కొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కమల్‌నాథ్‌కు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలలో బైహార్ ఎమ్మెల్యే సంజయ్ ఉయికే, పాంధుర్నా ఎమ్మెల్యే నీలేష్ ఉకే, సౌన్సర్ ఎమ్మెల్యే విజయ్ చౌరే సహా 12 మంది పేర్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు..! కమల్ నాథ్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాల మధ్య ఆయన కుమారుడు నకుల్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి కాంగ్రెస్ లోగోను తొలగించారు. నకుల్ తీసుకున్న ఈ స్టెప్ తన తండ్రితో కలిసి బీజేపీలో చేరుతున్నట్లు గత కొన్ని రోజులుగా జరుగుతున్న వదంతలకు మరింత ఆజ్యం పోసింది.
కమల్‌నాథ్‌కు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు?
సంజయ్ ఉకే- బైహార్ ఎమ్మెల్యే నీలేష్ ఉకే- పాంధుర్నా ఎమ్మెల్యే సోహన్ బాల్మీకి- పరాసియా నుంచి ఎమ్మెల్యే విజయ్ చౌరే- సౌన్సార్ ఎమ్మెల్యే కమలేష్ షా- అమర్‌ఘర్హా ఎమ్మెల్యే దినేష్ గుర్జార్ – మొరెనా ఎమ్మెల్యే మధు భగత్ – పార్స్వాడ ఎమ్మెల్యే వివేక్ పటేల్- వారాశివాణి ఎమ్మెల్యే లఖన్ ఘంఘోరియా- జబల్‌పూర్ ఎమ్మెల్యే యోగేంద్ర సింగ్- లఖ్‌నాడన్ ఎమ్మెల్యే రజనీష్ సింగ్ – కేవలరి ఎమ్మెల్యే సిద్ధార్థ్ కుష్వాహా- సత్నా ఎమ్మెల్యే
కాగా, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలతో కమల్ నాథ్ ఇవాళ రేపట్లో భేటీ కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కమల్‌నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ పోటీ చేయడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది నేతలు ఆయన మద్దతుదారులే ఉండటం విశేషం. మరోవైపు, కమల్‌నాథ్‌తో పాటు 22 మందికి పైగా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారనే చర్చ జరుగుతోంది. సంఖ్య 22 కంటే ఎక్కువ ఉంటే ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు..! రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జితు పట్వారీ.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉమంగ్ సింగర్‌తో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను సంప్రదించారు. ఇంతలో పలువురు ఎమ్మెల్యేల ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. దీంతో చాలా మంది ఎమ్మెల్యేలను పార్టీ సంప్రదించలేకపోతోంది.
మధ్యప్రదేశ్ సీనియర్ నేత కమల్‌నాథ్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలకు అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఎంపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఆయనే కారణమని చెబుతున్నారు. దీంతో ఆయనకు కోపం వచ్చింది. అదే సమయంలో, రాజీనామా చేయకుండా కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికను నిర్వహించడం ద్వారా ఆయనను నిర్లక్ష్యం చేసినట్లు భావించారు. పార్టీ అధినాయకత్వంతో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆయన కొంత మేర ఆగ్రహంతో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో పాటు రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కకపోవడం కూడా ఆయన అసంతృప్తికి ప్రధాన కారణం కావచ్చని తెలుస్తోంది.
ఇదిలావుంటే, శ్రీరాముడిని కాంగ్రెస్ అవమానించిందని మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ అన్నారు. అయోధ్యలో రామ్‌లాలా ‘ప్రాణ్‌ప్రతిష్ట’ వేడుకకు ట్రస్ట్ ఆహ్వానాన్ని అంగీకరించకపోవడంపై పలువురు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ, సమాజ ప్రయోజనాల కోసం పనిచేయాలనుకునే వారికి బీజేపీలోకి స్వాగతం పలుకుతామన్నారు వీడీ శర్మ. మరోవైపు, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితూ పట్వారీ కమల్‌నాథ్‌పై వచ్చిన వార్తలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




