Uttar Pradesh: భార్యపై అనుమానం.. తెగ నరికిన భార్య తలతో నడిరోడ్డుపైకి భర్త! ఆ తర్వాత ఏం జరిగిందంటే
ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్య తలను నరికి, చేతిలో పట్టుకుని రోడ్లపై బహిరంగంగా తిరుగుతూ కనిపించాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో గురువారం (ఫిబ్రవరి 15) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి చెందిన అనిల్ అనే వ్యక్తి వృత్తి రిత్యా తాపీ మేస్త్రీ. అనిల్‌కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యతో కలిసి వేరు కాపురం పెట్టిన అతడు కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు..
లక్నో, ఫిబ్రవరి 16: ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్య తలను నరికి, చేతిలో పట్టుకుని రోడ్లపై బహిరంగంగా తిరుగుతూ కనిపించాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో గురువారం (ఫిబ్రవరి 15) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి చెందిన అనిల్ అనే వ్యక్తి వృత్తి రిత్యా తాపీ మేస్త్రీ. అనిల్‌కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యతో కలిసి వేరు కాపురం పెట్టిన అతడు కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానం అతనిలో బలంగా ఏర్పడింది. ఈ విషయమై దంపతుల మధ్య తరచూ గొడవలు రాసాగాయి. ఈ క్రమంలో గురువారం దంపతులిద్దరూ మళ్లీ గొడవపడ్డారు. కోపోధ్రిక్తుడైన అనిల్ భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం ఆమె తల నరికి రోడ్లపై తిరుగుతూ కనిపించాడు. చుట్టుపక్కల వారు అతన్ని చూసి భయాందోళనలకు గురయ్యారు. ఒక చేత్తో తలను, మరో చేతిలో కత్తిని పట్టుకుని ఉన్న దృశ్యాలను బాటసారులు తమ ఫోనుల్లో చిత్రీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు అనిల్‌ను అరెస్ట్ చేసి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనిల్‌ను అరెస్టు చేసే వరకు రోడ్లపై వేలాది మంది ప్రయాణికులు ఈ ఘోర దృశ్యాన్ని వీక్షించారు.
కాగా బుధవారం సరిగ్గా ఇలాంటి సంఘటన పశ్చిమ బెంగాల్‌లో వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల గౌతమ్ గుచ్చైత్ అనే వ్యక్తి తన భార్య తల నరికి బస్ స్టాప్ సమీపంలో కనిపించాడు. కుటుంబ కలహాల వల్ల నిందితుడు గౌతమ్ గుచ్చైత్ తన భార్యను నరికి చంపినట్లు సమాచారం. స్థానికులు చిత్రీకరించిన వీడియోలలో నిందితుడు ఒక చేతిలో భార్య తల, మరొక చేతిలో కొడవలితో కనిపించాడు. తన చుట్టూ గుమిగూడిన జనంపై అసభ్య వ్యాఖ్యలు చేయడం వీడియోలో కనిపించింది. గంట తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అతని తల్లిదండ్రులను కూడా పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఫిబ్రవరి 14న పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అతడి మానసిక స్థితి సరిగ్గాలేదని నిందితుడి తల్లిదండ్రులు పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం (2021) కోల్‌కతాలోని అలీపూర్ జంతుప్రదర్శనశాలలో గౌతమ్ సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకి తీవ్రంగా గాయపడ్డాడు.14 అడుగుల సరిహద్దు గోడను ఎక్కి రెండు నెట్ ఫెన్సింగ్‌లను దాటి ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత నేలపై పాకుతూ సింహం దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.