AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Nitish Bhardwaj: ‘నా మాజీ భార్య వేధిస్తోంది.. రక్షణ కల్పించండి’.. పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ సీరియల్ నటుడు

ప్రముఖ టెలివిజన్‌ సీరియల్‌ 'మహాభారతం' నటుడు నితిష్‌ భరద్వాజ్‌ మాజీ భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన మాజీ భార్య మధ్యప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ స్మితీ భరద్వాజ్‌. సుధీర్ఘ కాలంగా స్మితీ భరద్వాజ్‌ తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తుందంటూ ఫిర్యాదులో నితిష్‌ భరద్వాజ్‌ పేర్కొన్నాడు. ఈ మేరకు తనకు రక్షణ కల్పించవల్సిందిగా భోజాల్‌ పోలీస్‌ కమిషనర్‌ హరినారాయణచారి మిశ్రాకు నితీశ్‌ లేఖ రాశారు. తన మాజీ భార్య తనను..

Actor Nitish Bhardwaj: 'నా మాజీ భార్య వేధిస్తోంది.. రక్షణ కల్పించండి'.. పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ సీరియల్ నటుడు
Actor Nitish Bhardwaj
Srilakshmi C
|

Updated on: Feb 15, 2024 | 3:37 PM

Share

ప్రముఖ టెలివిజన్‌ సీరియల్‌ ‘మహాభారతం’ నటుడు నితిష్‌ భరద్వాజ్‌ మాజీ భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన మాజీ భార్య మధ్యప్రదేశ్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ స్మితీ భరద్వాజ్‌. సుధీర్ఘ కాలంగా స్మితీ భరద్వాజ్‌ తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తుందంటూ ఫిర్యాదులో నితిష్‌ భరద్వాజ్‌ పేర్కొన్నాడు. ఈ మేరకు తనకు రక్షణ కల్పించవల్సిందిగా భోజాల్‌ పోలీస్‌ కమిషనర్‌ హరినారాయణచారి మిశ్రాకు నితీశ్‌ లేఖ రాశారు. తన మాజీ భార్య తనను మానసికంగా వేధించడమే కాకుండా తన కవల కుమార్తెలను కలవడానికి కూడా అనుమతించడం లేదనీ నటుడు నితీశ్‌ లేఖలో పేర్కొన్నారు.

నితీష్ భరద్వాజ్ ఫిర్యాదు మేరకు భోపాల్ పోలీస్ కమిషనర్ దీనిపై విచారణకు ఆదేశించారు. విచారణ బాధ్యతను అదనపు డీసీపీ షాలినీ దీక్షిత్‌కు అప్పగించారు. నితీష్ భరద్వాజ్ నుంచి ఫిర్యాదు అందిందని, దీనిపై విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని భోపాల్ పోలీస్ కమిషనర్ హరినారాయణాచారి మిశ్రా మీడియాకు తెలిపారు.

కాగా ప్రముఖ టీవీ షో ‘మహాభారతం’లో నటుడు నితీష్ భరద్వాజ్ శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తున్నారు. కృష్ణుడి పాత్రలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు. హిందీలో ప్రసారమయ్యే ఈ సీరియల్‌ ఇప్పటికే మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఇక నటుడు నితీష్ భరద్వాజ్ వ్యక్తి గత జీవితం విషయానికొస్తే.. మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన IAS ఆఫీసర్‌ అయిన స్మితను మార్చి 14, 2009న వివాహం చేసుకున్నారు. వీరికి 11 యేళ్ల వయస్సు గల కవల కుమార్తెలు ఉన్నారు. 12 సంవత్సరాల తర్వాత నితీష్, స్మిత 2019లో తమ బంధానికి ముగింపు పలికారు. 2022లో వీరికి కోర్టు విడాకులు ఖరారు చేసింది. భర్తతో విడిపోయిన తర్వాత స్మిత తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇండోర్‌లో నివసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.