Director Prakash Koleri: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఇంట్లో శవమై కనిపించిన ప్రముఖ డైరెక్టర్! ఏం జరిగిందో..
ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రకాష్ కొలేరి (65) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. కేరళలోని వాయనాడ్ జిల్లాలోని ఆయన నివాసంలో మంగళవారం (ఫిబ్రవరి 13) శవమై కనిపించారు. అందిన సమాచారం మేరకు డైరెక్టర్ ప్రకాశ్ కొలేరి వాయనాడ్‌లోని తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆయన ఇంటి ఇరుగుపొరుగు వారికి కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పొరుగింటి వారు ప్రకాశ్ ఇంటికి..
వాయనాడ్, ఫిబ్రవరి 14: ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రకాష్ కొలేరి (65) అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించారు. కేరళలోని వాయనాడ్ జిల్లాలోని ఆయన నివాసంలో మంగళవారం (ఫిబ్రవరి 13) శవమై కనిపించారు. అందిన సమాచారం మేరకు డైరెక్టర్ ప్రకాశ్ కొలేరి వాయనాడ్‌లోని తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆయన ఇంటి ఇరుగుపొరుగు వారికి కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన పొరుగింటి వారు ప్రకాశ్ ఇంటికి వెళ్లి చూడగా.. ఇంటి లోపల శవమై కనిపించింది. దీంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఆయన మరణానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియ రాలేదు. డైరెక్టర్ ప్రకాశ్ కొలేరి మృతిపట్ల మలయాళ సిని పరిశ్రలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కాగా డైరెక్టర్ ప్రకాష్ కొలేరి ‘మిళితాలిల్ కన్నీరుమయి’ అనే సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఈ మువీలో మురళి, ఆశా జయరామ్ నటించారు. ఆ తర్వాత 1993 ఆయన తెరకెక్కించిన ‘అవన్ అనంతపద్మనాభన్’ అనే మువీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో కన్నడ నటుడు, దర్శకుడు రమేష్ అరవింద్, సుధా చంద్రన్, ఎమ్‌జీ సోమన్, మత్తు, రాజన్ పి దేవ్, టీజీ రవి తదితరులు నటించారు. 1999లో విడుదలైన ‘వరుణ్ వారథిరికిల్ల’ తర్వాత ఆయన సుదీర్ఘ విరామం తీసుకున్నారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ‘పాట్టుపుస్తకం’తో మళ్లీ డైరెక్టర్‌గా మారారు. ఫిలిం మేకర్‌గా ఇదే ఆయని చివరి సినిమా కూడా. సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా స్క్రిప్ట్‌లు రాయడం, నటనలోనూ ప్రకాశ్‌కు ప్రావీణ్యం ఉంది.
గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన పలువురి మరణ వార్తలు జీర్ణించుకోకముందే తాజాగా దర్శకుడు ప్రకాష్ కొలేరి మృతి చెందడంతో పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.