AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mysterious: బెర్ముడా ట్రయాంగిల్ మాదిరిగానే అక్కడ మాయం అవుతున్న షిప్‌లు.. 84 యేళ్ల తర్వాత వీడిన మిస్టరీ!

ఈ భూమిపై కొన్ని మిస్టీరియస్‌ ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లిన వారు ఇప్పటి వరకూ వెనక్కి వచ్చిన దాఖలాలు లేవు. అలాంటి రహస్యమైన ప్రదేశాల్లో కొన్ని సముద్రాలు, సరస్సులు కూడా ఉన్నాయి. అక్కడకు వెళ్లిన ఓడలు మళ్లీ మళ్లీ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటికే మీరు గుర్తుపట్టి ఉంటారు.. అవును మనం చర్చిస్తోంది కరేబియన్ సముద్రంలో బెర్ముడా ట్రయాంగిల్ గురించే. అక్కడికి వెళ్లిన అనేక నౌకలు రహస్యంగా అదృశ్యమైపోతున్నాయి. ఆపై కొన్నాళ్ల తర్వాత సదరు ఓడ శిథిలాలు..

Mysterious: బెర్ముడా ట్రయాంగిల్ మాదిరిగానే అక్కడ మాయం అవుతున్న షిప్‌లు.. 84 యేళ్ల తర్వాత వీడిన మిస్టరీ!
Shipwreck Of Merchant Vessel
Srilakshmi C
|

Updated on: Feb 13, 2024 | 4:27 PM

Share

ఈ భూమిపై కొన్ని మిస్టీరియస్‌ ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లిన వారు ఇప్పటి వరకూ వెనక్కి వచ్చిన దాఖలాలు లేవు. అలాంటి రహస్యమైన ప్రదేశాల్లో కొన్ని సముద్రాలు, సరస్సులు కూడా ఉన్నాయి. అక్కడకు వెళ్లిన ఓడలు మళ్లీ మళ్లీ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇప్పటికే మీరు గుర్తుపట్టి ఉంటారు.. అవును మనం చర్చిస్తోంది కరేబియన్ సముద్రంలో బెర్ముడా ట్రయాంగిల్ గురించే. అక్కడికి వెళ్లిన అనేక నౌకలు రహస్యంగా అదృశ్యమైపోతున్నాయి. ఆపై కొన్నాళ్ల తర్వాత సదరు ఓడ శిథిలాలు బయటపడుతున్నాయి. సరిగ్గా ఇలాంటి మిస్టీరియస్‌ సంఘటనలు ఉత్తర అమెరికాలోని లేక్ సుపీరియర్‌లోనూ జరుగుతున్నాయి. 84 ఏళ్ల క్రితం మునిగిపోయిన ఓ ఓడ శిథిలాలు తాజాగా బయటపడ్డాయి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద రహస్యాలలో ఒకటిగా పేరుగాంచింది. అసలేం జరిగిందంటే..

1940, మే 1న S.S ఆర్లింగ్టన్ అనే కెనడా షిప్‌ సుపీరియర్ మధ్యలో తుఫానులో చిక్కుకుని మునిగిపోయింది. నిజానికి, లేక్ సుపీరియర్ విస్తీర్ణం ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. వాల్యూమ్ ప్రకారం ఇద మూడో అతిపెద్ద నది. ప్రపంచంలోని మంచినీటిలో 10% ఇందులోనే ఉంది. ఈ సరస్సు శతాబ్దాలుగా ప్రధాన వాణిజ్య షిప్పింగ్ కారిడార్‌గా పనిచేసింది. దాదాపు 32,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సులో వందలాది శిధిలాలు ఉన్నాయని అంచనా. తాజాగా 84 యేళ్ల తర్వాత ఈ ఓడ శిధిలాలు ఇందులో కనుగొన్నారు. దీంతో నాటి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ప్రశ్నలకు సమాధానాలు లభించినట్లైంది.

అసలు ఆ ఓడ ఎందుకు మునిగిపోయింది..?

1940లో S.S ఆర్లింగ్టన్ షిప్‌ మునిగిపోయినప్పుడు, దానితో ఒక మిస్టీరియస్‌ సంఘటన జరిగింది. తమ ప్రాణాలకు ప్రమాదం ఉందని గమనించిన ఓడ సిబ్బంది లైఫ్ బోట్లు ఎక్కారు. వారితోపాటు ఓడలో కెప్టెన్ కూడా ఉన్నాడు. అతని పేరు ఫ్రెడరిక్ బర్క్. ఇతన్ని టాటీ బగ్ అని పిలిచేవారు. సిబ్బంది లైఫ్ బోట్ ఎక్కిన తర్వాత సిబ్బంది ఫ్రెడరిక్ బర్క్‌ను కూడా అందులోకి ఎక్కించేందుకు సహాయం అందించారు. కానీ ఆ సమయంలో వారికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఫ్రెడరిక్ బర్క్ చేతులు ఊపుతూ కనిపించారు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే కెప్టెన్, ఓడ నీటిలో మునిగిపోయాయి. ఆ సమయంలో కెప్టెన్ వింత ప్రవర్తన ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది. ఆ రోజు ఓడకు ఏం జరిగిందో గ్రేట్ లేక్స్ షిప్‌రెక్ హిస్టారికల్ సొసైటీ పరిశోధకులు ఇప్పటికీ బహిర్గతం చేయలేకపోయారు. ప్రమాద సమయంలో కెఫ్టెన్ ఏం చెప్పడానికి ప్రయత్నించారనేది ప్రశ్నగా మిగిలిపోయింది. అతను లైఫ్ బోట్ కోసం ప్రయత్నించాడా లేదా వీడ్కోలు చెప్పాడా? అనేది అంతుపట్టని చిక్కుప్రశ్నగా మిగిలిపోయిందని హిస్టారికల్ సొసైటీకి చెందిన పరిశోధకుడు డాన్ ఫౌంటెన్ అన్నాడు.

Shipwreck of Merchant Vessel

Shipwreck of Merchant Vessel

ఓడ శిథిలాలు ఎవరు కనుగొన్నారంటే..

మిచిగాన్‌లోని నెగౌనీ నివాసి ఫౌంటెన్ అనే వ్యక్తి ఆర్లింగ్టన్ షిప్ శిధిలాలు కనుగొన్నాడు. ఫౌంటెన్ దాదాపు దశాబ్దం పాటు షిప్‌ ఆనవాళ్ల కోసం లేక్ సుపీరియర్‌లో రిమోట్ సెన్సింగ్ నిర్వహించాడు. గత ఏడాది ఆర్లింగ్టన్ షిప్‌ను తాను కనుగొన్నట్లు ఫౌంటెన్ హిస్టారికల్ సొసైటీకి తెలియజేశాడు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.