Malaikottai Vaaliban OTT: ఓటీటీలోకి మోహన్‌లాల్ రీసెంట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాన్ నటించిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మలైకోటై వాలిబన్. జల్టికట్టు ఫేమ్ లిజో జోస్ పెల్లిసరీ తెరెక్కించిన ఈ సినిమాలో మోహన్ లాల్ డ్యూయల్ రోల్ చేయడం విశేషం. అలాగే సోనాలీ కులకర్ణి, హరీశ్ పేరడీ తదితర ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల పోషించారు. భారీ బడ్జెట్ తో నిర్మించడం, టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్లు ఇంట్రెస్ట్‌గా ఉండడంతో మలైకోటై వాలిబన్‌పై ఆసక్తి పెరిగింది
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాన్ నటించిన పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మలైకోటై వాలిబన్. జల్టికట్టు ఫేమ్ లిజో జోస్ పెల్లిసరీ తెరెక్కించిన ఈ సినిమాలో మోహన్ లాల్ డ్యూయల్ రోల్ చేయడం విశేషం. అలాగే సోనాలీ కులకర్ణి, హరీశ్ పేరడీ తదితర ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల పోషించారు. భారీ బడ్జెట్ తో నిర్మించడం, టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్లు ఇంట్రెస్ట్‌గా ఉండడంతో మలైకోటై వాలిబన్‌పై ఆసక్తి పెరిగింది. అయితే తీరా థియేటర్లలోకి అంచనాలు అందుకోలేకపోయింది. రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజైన ఈ మూవీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. మొదట మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ భాషల్లోనూ ఈ భారీ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ నెగెటివ్ టాక్ రావడంతో మేకర్స్ వెనక్కు తగ్గారు. అయితే ఇప్పుడు మలైకొటై వాలిబాన్ తెలుగు వెర్షన్ థియేటర్లలో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కానుందని టాక్ వినిపిస్తోంది. మార్చి 1 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మలైకోటై వాలిబన్‌ను స్ట్రీమింగ్కు తీసుకొచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
మలైకోటై వాలిబన్ సినిమాలో మోహన్ లాల్ డ్యూయల్ రోల్ చేశాడు. ఆయన యాక్టింగ్, చూపించిన వేరియేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ అభిమాలనులను బాగా అలరించాయి. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయని టాక్ వినిపించింది. అయితే కథను కన్ఫ్యూజన్‌గా చెప్పడంతో సినిమా పరాజయం పాలైందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్య్రం కోసం మలైకోటై ప్రాంత ప్రజలు ఎలాంటి పోరాటం చేశారన్న నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాను ఇండియాలో సెంచురీ ఫిల్మ్స్, ఓవర్సీస్‌లో ఫార్ ఫిల్మ్ కంపెనీ, ఆశీర్వాద్ సినిమాస్ కో ఎల్ఎల్సీ నిర్మించాయి.
మలైకోటై వాలిబన్ లో మోహన్ లాల్..
Here’s the Release Teaser of #MalaikottaiVaaliban
Gear up to experience the epic spirit in theatres!#VaalibanVaraar pic.twitter.com/KJOwVKHVqO
— Mohanlal (@Mohanlal) January 24, 2024
#MalaikottaiVaaliban 18 Days WW Box Office Estimate:
Kerala: ₹14.4 Cr Rest of India (ROI): ₹2.25 Cr
Overseas Gross: $1.6 M || ₹13.35 CR
Total WW Gross: ₹30 Cr
20% Recovery – Disaster pic.twitter.com/Awfdd56SlT
— I’m_Film Lover_Sri* (@srinu027) February 13, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.