Saba Nayagan OTT: వేలంటైన్స్‌డే గిఫ్ట్ .. ఓటీటీలోకి వచ్చేసిన బ్యూటీఫుల్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అశోక్ సెల్వన్, కలర్ ఫొటో ఫేమ్ చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం సబా నాయగన్. ఇదే మూవీలో చాందినీ చౌదరి, కార్తీక మురళీ ధరన్ కూడా కీలక పాత్రలు పోషించారు. ప్రభాస్ సలార్ కు పోటీగా డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలైన సబానాయగన్ సూపర్ హిట్ గా నిలిచింది. డిఫరెంట్ టైమ్ పీరియడ్స్‌లో సాగే ఈ ప్రేమకథకు
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అశోక్ సెల్వన్, కలర్ ఫొటో ఫేమ్ చాందినీ చౌదరి జంటగా నటించిన చిత్రం సబా నాయగన్. ఇదే మూవీలో చాందినీ చౌదరి, కార్తీక మురళీ ధరన్ కూడా కీలక పాత్రలు పోషించారు. ప్రభాస్ సలార్ కు పోటీగా డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలైన సబానాయగన్ సూపర్ హిట్ గా నిలిచింది. డిఫరెంట్ టైమ్ పీరియడ్స్‌లో సాగే ఈ ప్రేమకథకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఇక అశోక్ సెల్వన్, చాందినీ చౌదరి, మేఘా ఆకాశ్‌ల స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో ఆడియెన్స్‌ను అలరించిన సబా నాయగన్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబానాయగన్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వాలంటైన్స్‌డే కానుకగా బుధవారం (ఫిబ్రవరి 14) ఓటీటీలోకి అందుబాటులో వవచ్చేసింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ ప్రేమకథ స్ట్రీమింగ్ అవుతోంది.
సబా నాయగన్ కథ ఏమిటంటే..
తాగిన మత్తులో సబా (అశోక్ సెల్వన్) అనే యువకుడు రచ్చ చేయడంతో పోలీసులు అరెస్ట్ చేస్తారు. లవ్ ఫెయిల్యూర్‌తోనే సబా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడని పోలీస్ ఆఫీసర్ అర్థం చేసుకుంటాడు. దీంతో అతని లవ్ స్టోరీ గురించి అడుగుతాడు. అప్పుడు సబా తన జీవితంలోకి వచ్చిన రియా, మేఘ, దీప్తిల గురించి చెబుతాడు? మరి ఈ ముగ్గురిలో సబా ఎవరిని ప్రేమించాడు అన్నదే ఈ సినిమా కథ. వేలంటైన్స్ డే రోజున ఓ మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ చూడాలనుకునేవారికి సబా నాయగన్ ఓ మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్.
#Sabanayagan Now Streaming on #DisneyPlusHotstar ⚡
Available In: Tamil | Hindi | Telugu | Malayalam | Kannada #SabanayaganOnHotstar #AshokSelvan #SabanayaganHindi pic.twitter.com/uFkqiqT9WG
— Surya Mehra 🕊️ (@thesuryamehra) February 14, 2024
తెలుగులోనూ స్ట్రీమింగ్..
Oru Oorla Oru Sabanayagan 😉#Sabanayagan Streaming from February 14 on #DisneyPlusHotstar #SabanayaganOnHotstar pic.twitter.com/0ZQxiieXF6
— Disney+ Hotstar Tamil (@disneyplusHSTam) February 13, 2024
➡️your perfect family entertainment! 🤩 #sabanayagan #SabaNayaganintentkotta NOWWWW ♥️@AshokSelvan @akash_megha @iChandiniC @KarthikaMurali_ @karvig @leon_james@ClearwaterFilms @APIfilms pic.twitter.com/qQg5bEY5ye
— Tentkotta (@Tentkotta) February 14, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.