AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhavan-Kangana Ranaut: కంగనా, మాధవన్‌ల సెల్ఫీ వైరల్‌.. ఎందుకు కలిశారో తెలుసా?

నటి కంగనా రనౌత్ కూడా దర్శకత్వంపై ఆసక్తి చూపుతోంది. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో ఆమె ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల..

Madhavan-Kangana Ranaut: కంగనా, మాధవన్‌ల సెల్ఫీ వైరల్‌.. ఎందుకు కలిశారో తెలుసా?
Madhavan, Kangana Ranaut
Basha Shek
|

Updated on: Feb 13, 2024 | 4:37 PM

Share

ఆర్. మాధవన్, కంగనా రనౌత్‌ లది బాలీవుడ్‌ లో సూపర్‌ హిట్‌ జోడీ. వీరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘తను వెడ్స్ మను’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ వంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. నటి కంగనా రనౌత్ స్వయంగా ఈ విషయాన్ని పంచుకున్నారు. మాధవన్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. దీంతో అభిమానులకు హ్యాపీ న్యూస్ అందించారీ సూపర్‌ జోడీ. మాధవన్‌ తో కలిసి దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసిన కంగనా రనౌత్ ‘నేను నా అభిమాన నటుడితో మరో సర్ ప్రైజ్ మూవీ కోసం జతకడుతున్నాను’ అని క్యాప్షన్‌ ఇస్తే.. ‘కంగనా రనౌత్‌తో కలిసి పనిచేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను’ అని ఆర్‌ మాధవన్ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ స్క్రిప్ట్ రీడింగ్‌లో నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. 2011లో ‘తను వెడ్స్ మను’ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత 2015లో ఇదే సినిమాకు సీక్వెల్‌ ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ విడుదలైంది. ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత కొత్త సినిమా కోసం ఆర్. మాధవన్, కంగనా రనౌత్ జంటగా నటిస్తున్నారు. ఈసారి ఎలాంటి సినిమాలో నటిస్తున్నాడో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

మరోవైపు నటి కంగనా రనౌత్ కూడా దర్శకత్వంపై ఆసక్తి చూపుతోంది. ఆమె దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎమర్జెన్సీ’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో ఆమె ఇందిరా గాంధీ పాత్రను పోషించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఇప్పటికే రిలీజ్‌ కావాల్సి ఉంది. కానీ వివిధ కారణాల వల్ల సినిమా విడుదల తేదీని ముందుకు తీసుకెళ్లారు. ‘ఎమర్జెన్సీ’ జూన్ 14న విడుదల కానుంది. ఇందులో ఇందిరా గాంధీగా కంగన, జయప్రకాష్‌ నారాయణ్‌ పాత్రలో అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి