- Telugu News Photo Gallery Cinema photos Prabhas Kalki 2898 AD to Sai Pallavi about Kamal Hasaan latest movie updates from South Film Industry
Movie Updates: కల్కిలో ప్రభాస్ ఎంట్రీపై న్యూస్.. కమల్ గురించి సాయిపల్లవి..
కల్కి 2898ఏడీలో ప్రభాస్ ఎంట్రీ మామూలుగా ఉండదు భయ్యా అని అంటున్నారు మ్యూజిక్ డైరక్టర్ సంతోష్ నారాయణ్. అసలు మీకు ఇవన్నీ ఎవరు చెబుతున్నారు? చూసి ఆశ్చర్యపోవడం నా వంతు అవుతోందని అంటున్నారు మేడమ్ రష్మిక మందన్న. ఇప్పుడు స్టార్‌డమ్ ఉన్న నటీమణులైనా, ఒకప్పుడు ఎవరో ఒక హీరో మీద క్రష్ ఉండే ఉంటుంది. రీసెంట్‌గా అలాంటి విషయాన్ని రివీల్ చేశారు డ్యాన్సింగ్ యాక్ట్రస్ సాయిపల్లవి.
Updated on: Feb 13, 2024 | 4:20 PM

కల్కి 2898ఏడీలో ప్రభాస్ ఎంట్రీ మామూలుగా ఉండదు భయ్యా అని అంటున్నారు మ్యూజిక్ డైరక్టర్ సంతోష్ నారాయణ్. ఆ ఒక్క మాట చెప్పి ఊరుకోలేదు ఆయన. ప్రభాస్ ఇంట్రోకి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్‌ని మొత్తం మళ్లీ చేస్తున్నానని అన్నారు.

అంతే కాదు, అత్యంత ప్రత్యేకమైన విషయాలను ఏర్చికూర్చి ప్రభాస్ కోసం స్పెషల్‌గా మ్యూజిక్ డిజైన్ చేస్తున్నట్టు చెప్పారు. వెరీ బిగ్, మాస్ ఇంట్రోని ఎక్స్ పెక్ట్ చేయొచ్చని డార్లింగ్ ఫ్యాన్స్ లో జోష్ నింపేస్తున్నారు నారాయణ్. సమ్మర్ కానుకగా మే9న విడుదల కానుంది కల్కి 2898ఏడీ.

అసలు మీకు ఇవన్నీ ఎవరు చెబుతున్నారు? చూసి ఆశ్చర్యపోవడం నా వంతు అవుతోందని అంటున్నారు మేడమ్ రష్మిక మందన్న. యానిమల్ సక్సెస్ తర్వాత రష్మిక పారితోషికం పెంచేశారని, 4, 4.5కోట్ల మధ్య అందుకుంటున్నారని వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. వాటికి స్పందించారు నేషనల్ క్రష్. నేను ఇంత తీసుకోవాలని మీడియా వాళ్లు అనుకుంటున్నారు.

ఆ మాటలను నేను కూడా కన్సిడర్ చేసి, నిర్మాతలను అడిగేస్తే పోతుందనిపిస్తోందని అన్నారు. అదేంటమ్మా అని నిర్మాతలు అడిగితే, 'నేనేం చేయను సార్... నా మీద ఎక్స్ పెక్టేషన్స్ అలా ఉన్నాయి. వాళ్ల మాటలు నిజం చేయాలంటే ఆ మాత్రం అడగాలి కదా అని చెప్పేస్తాను' అంటూ సరదాగా ఎమోజీలను యాడ్ చేసేశారు రష్మిక.

ఇప్పుడు స్టార్‌డమ్ ఉన్న నటీమణులైనా, ఒకప్పుడు ఎవరో ఒక హీరో మీద క్రష్ ఉండే ఉంటుంది. రీసెంట్‌గా అలాంటి విషయాన్ని రివీల్ చేశారు డ్యాన్సింగ్ యాక్ట్రస్ సాయిపల్లవి. కమల్‌హాసన్ తన ఫేవరేట్ హీరో అని ఓపెన్ అయ్యారు పల్లవి. కమల్ నటించిన మహానది తన ఫేవరేట్ మూవీ అని, ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదని అంటున్నారు పల్లవి. అంతే కాదు, లోకనాయకుడిని ఒక్కసారి చూస్తే చాలనుకునేవారట. అలాంటిది ఆయన ప్రొడక్షన్‌లో నటించడం డ్రీమ్ కమ్ ట్రూ అని చెబుతున్నారు లేడీ పవర్‌స్టార్.




