Aditi Rao Hydari: క్యూట్ ఫొటోలతో కేకపెట్టిస్తున్న అదితిరావ్ హైదరి
అదితి రావు హైదరి.. చెలియా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ అందాల భామ. ఆతర్వాత సమ్మోహనం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ చిన్నది.
Updated on: Feb 14, 2024 | 12:40 AM

అదితి రావు హైదరి.. చెలియా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ అందాల భామ. చూడ చక్కని రూపంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తమిళ్ లో పలు సినిమాల్లో నటించినప్పటికీ చెలియా సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది అదితి రావు హైదరి.

ఆతర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన సమ్మోహనం సినిమాతో తెలుగులో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటించాడు. మొదటి సినిమా అయినా తెలుగులో చక్కగా మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది అదితి. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది ఈ చిన్నది.

సమ్మోహనం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా వరుణ్ తేజ్ తో అంతరిక్షం, నాని , సుధీర్ బాబు మల్టీస్టారర్ వి, శర్వానంద్, సిద్దార్థ్ మల్టీస్టారర్ మహాసముద్రంలాంటి సినిమాలు చేసింది కానీ మంచి హిట్ మాత్రం అందుకోలేకపోయింది అదితి రావు హైదరి.

తమిళ్ లోనూ ఇప్పుడు ఈ చిన్నది పెద్దగా కనిపించడం లేదు'. అక్కడ హే సినామిక అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. అలాగే కాజల్ అగర్వాల్ మరో హీరోయిన్ గా నటించింది. ఇక సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటుంది.

సోషల్ మీడియాలో అదితి షేర్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది. చీరకట్టుతో పాటు మోడ్రన్ డ్రస్సుల్లోనూ అదరగొడుతుంది ఈ అమ్మడు. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది అదితి రావు హైదరి. చీరకట్టులో ఈ అమ్మడి అందం మరింత ఎక్కువైంది అంటున్నారు ఫ్యాన్స్. ఈ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ వస్తున్నాయి.




