దయచేసి నాకు మీ సినిమాలో అవకాశం ఇవ్వకండి అంటూ సందీప్‌రెడ్డి వంగాను ఉద్దేశించి రిక్వెస్ట్ చేశారు కంగనా రనౌత్. ఒకవేళ తన మాట కాదని సందీప్ ఛాన్స్ ఇస్తే, ఆయన సినిమాల్లోని ఆల్ఫా మేల్ కేరక్టర్లు ఫెమినిస్టులుగా మారిపోవాల్సి వస్తుందని, అలాంటప్పుడు సినిమాలు ఫ్లాప్ అవుతాయని అన్నారు. సందీప్ డైరక్ట్ చేసిన యానిమల్ మీద కంగన విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆ మాటలకు స్పోర్టివ్‌గా రియాక్ట్ అయిన సందీప్ రెడ్డి వంగా వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు కంగన.