రామ్ చరణ్‌ని చూసి జెలస్ ఫీలవుతున్నానని అంటున్నారు ఉపాసన. అది కూడా కుమార్తె క్లీంకార విషయంలోనే అని ఓపెన్ చెబుతున్నారు ఉపాసన. చరణ్‌ని చూడగానే క్లీంకార ముఖం మీద మంచి వెలుగు కనిపిస్తుందట. ఆమె కళ్లల్లో మెరుపు, ఆ ఉత్సాహం చూస్తే తనకు కాస్త జెలసీగా ఉంటుందని అంటున్నారు ఉపాసన. పాప బాధ్యతలను ఇద్దరూ సమానంగా చూసుకుంటున్నామని, కెరీర్‌ని, కుటుంబాన్ని పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు ఉపాసన.