Ambajipeta Marriage Band OTT: ఓటీటీలో సుహాస్ అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్‌.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

రైటర్ పద్మభూషణ్‌ తో హిట్‌ కొట్టిన సుహాస్‌ అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చాడు. ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌ తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్‌ వద్ద డీసెంట్‌ కలెక్షన్లు రాబడుతూ మొదటి వీక్‌ లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది

Ambajipeta Marriage Band OTT: ఓటీటీలో సుహాస్ అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్‌.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Ambajipeta Marriage Band Mo
Follow us

|

Updated on: Feb 11, 2024 | 7:32 PM

రైటర్ పద్మభూషణ్‌ తో హిట్‌ కొట్టిన సుహాస్‌ అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమాతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చాడు. ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌ తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్‌ వద్ద డీసెంట్‌ కలెక్షన్లు రాబడుతూ మొదటి వీక్‌ లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది. కొత్త డైరెక్టర్ దుష్యంత్ కటికనేని తెరకెక్కించిన ఈ విలేజ్ ఎమోషనల్ డ్రామాలో శివాని నగరం హీరోయిన్‌ గా నటించింది. ఫిదా ఫేమ్‌ శరణ్యా ప్రదీప్‌ మరో కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబడుతోన్న అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్ చిత్రం ఓటీటీ రిలీజ్‌గురించి అప్పుడే వార్తలు వస్తున్నాయి. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా సుహాస్‌ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్‌ వెర్షన్‌ రిలీజైన నెలరోజుల్లోపే ఈ మూవీని స్ట్రీమింగ్‌ కు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. బహుశా మార్చి 1 నుంచే అంబాజీ పేట మ్యారేజీ బ్యాండ్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ కు అందుబాటులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ధీరజ్ మొగిలినేని నిర్మించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమా నితిన్‌ ప్రసన్న, గాయత్రి భార్గవి, గోపరాజు రమణ, జగదీష్‌ ప్రతాఫ్‌ భండారి, వినయ్‌ మహదేవ్‌, దివ్యా చలం శెట్టి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.శేఖర్ చంద్ర స్వరపరిచిన స్వరాలు సినిమాకు హైలెట్‌ గా నిలిచాయి. విలేజ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కుల వివక్ష కారణంగా అన్నా చెల్లెళ్లు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారది ఈ సినిమాలో చక్కగా చూపించారు డైరెక్టర్‌. ఇక అంతర్లీనంగా ప్రేమకథను కూడా జోడించాడు. కామెడీ, సెంటిమెంట్, లవ్‌, ఎమోషన్స్‌ ఇలా అన్నీ అంశాలు చక్కగా కుదరడంతో సుహాస్‌ ఖాతాలో మరో మంచి హిట్ సినిమా పడింది.

ఆహాలో స్ట్రీమింగ్ కానున్న అంబాజీ పేట మ్యారేజి బ్యాండ్..

బాక్స్ ఆఫీస్ దగ్గర మల్లిగాడి మోత

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..