Lal Salaam OTT: రజనీకాంత్‌ లాల్‌ సలామ్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన తాజా చిత్రం లాల్‌ సలామ్‌. రజనీ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యంగ్‌ హీరోలు విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే భారత దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌, జీవితా రాజశేఖర్‌ తదితరులు ఇతర పాత్రల్లో మెరిశారు

Lal Salaam OTT: రజనీకాంత్‌ లాల్‌ సలామ్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
Rajinikanth Lal Salaam Movie
Follow us

|

Updated on: Feb 11, 2024 | 9:35 PM

సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన తాజా చిత్రం లాల్‌ సలామ్‌. రజనీ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యంగ్‌ హీరోలు విష్ణు విశాల్‌, విక్రాంత్‌ సంతోష్‌ ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే భారత దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌, జీవితా రాజశేఖర్‌ తదితరులు ఇతర పాత్రల్లో మెరిశారు. పోస్టర్స్, టీజర్లు, ట్రైలర్‌ తో లాల్‌ సలామ్ సినిమాపై ఆసక్తి పెరిగింది. అయితే ఫిబ్రవరి 9న విడుదలైన ఈ మూవీకి మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజైన లాల్‌ సలామ్‌కు పెద్దగా కలెక్షన్లు రాలేదు. అయితే వీకెండ్‌లోనైనా లాల్ సలామ్‌ సినిమా కలెక్షన్లు పెరుగుతాయని మేకర్స్‌ ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో లాల్ సలామ్ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్‌ రజనీకాంత్‌ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మేకర్స్‌, ఓటీటీ సంస్థల మధ్య భారీ డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. అయితే థియేట్రికల్‌ రిలీజ్‌ తర్వాత 60 రోజులకు లాల్‌ సలామ్ ను స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. అయితే ఇప్పుడు థియేటర్ల దగ్గర లాల్‌ సలామ్‌ పరిస్థితిని చూసి ఈ నిర్ణయాన్ని మార్చుకునేపనిలో ఉన్నారట. అనుకున్న తేదీ కంటే ముందుగానే రజనీ సినిమాను ఓటీటీలోకి రిలీజ్ చేసే యోచనలో ఉన్నారట. అంటే మార్చి రెండో వారం లేదా మూడో వారంలోనే లాల్ సలామ్ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం ఉందన్నమాట.

ఇవి కూడా చదవండి

ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో లాల్ సలామ్ సినిమాను రూపొందించగా.. ఏ సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు.ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం. ఇక లాల్ సలామ్ స్టోరీ విషయానికి వస్తే.. ఒక గ్రామంలో జరిగే హిందూ, ముస్లిం గొడవలను ఆధారంగా చేసుకుని ఈ మూవీని తెరకెక్కించారు ఐశ్వర్య. ఇందులో మొయీద్దీన్ భాయ్‌గా రజనీకాంత్ అభినయానికి మంచి మార్కులే పడినా సినిమాలోని ఇతర అంశాలు ప్రేక్షకులకు పెద్దగా ఎక్కలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి