Guntur Kaaram: ఓటీటీలో ‘గుంటూరు కారం’ సెన్సెషన్.. కానీ ఆ విషయంలో హర్ట్ అవుతున్న ఆడియన్స్.. ఎందుకంటే..
ఈ నెల 9 నుంచి గుంటూరు కారం మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషలలో ఈమూవీ అందుబాటులో ఉంది. ఇక అటు ఓటీటీలోనూ సెన్సెషన్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఎంజాయ్ చేస్తున్నారు. అయితే చిత్రానికి అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ ఓ వర్గం అడియన్స్ మాత్రం ఫుల్ హర్ట్ అవుతున్నారు.
అల వైకుంఠపురంలో తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమా గుంటూరు కారం. అమ్మ సెంటిమెంట్ తోపాటు.. కాస్త మాస్ కమర్షియల్ టచ్ ఇచ్చి గురూజీ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై సూపర్ హిట్గా నిలిచింది. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరీ కీలకపాత్రలు పోషించారు. అలాగే రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో కనిపించారు. ఒక్కరోజు ముందే ప్రీమియర్స్ వేయడంతో ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. కానీ ఆ తర్వాత మాత్రం పాజిటివ్ టాక్తో దూసుకుపోయింది. ఎప్పటిలాగే గురూజీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ మరో హైలెట్. గుంటూరు కారం సినిమాలోని ప్రతి సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.ఇక ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ నెల 9 నుంచి గుంటూరు కారం మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషలలో ఈమూవీ అందుబాటులో ఉంది. ఇక అటు ఓటీటీలోనూ సెన్సెషన్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. థియేటర్లలో మిస్ అయినవారు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఎంజాయ్ చేస్తున్నారు. అయితే చిత్రానికి అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ ఓ వర్గం అడియన్స్ మాత్రం ఫుల్ హర్ట్ అవుతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. అదెంటంటే.. గుంటూరు కారం సినిమాను అన్ని భాషల్లోనూ డబ్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే కన్నడ అడియన్స్ మాత్రం ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ పై పెదవి విరుస్తున్నారు. ట్రాన్స్ లేషన్ తోపాటు.. వాయిర్ ఓవర్ కూడా అసలు బాగాలేదని కామెంట్స్ చేస్తున్నారు. కన్నడ డబ్బింగ్ చాలా నాసిరకంగా ఉందంటూ నెట్టింట విమర్శలు చేస్తున్నారు. పెద్ద సినిమా అయినా.. డబ్బింగ్ పై సరైన ఇంట్రెస్ట్ పెట్టలేదని.. ఎదో ఒకటి చేసి ఈ చిత్ర్నాని కన్నడ డబ్బింగ్ ప్రదర్శన పెళవంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మహేష్ రాజమౌళి కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇండోనేషియన్ బ్యూటీని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
Guntur Kaaram has to be the worst Kannada dubbed movie recently in terms of both writing and voice artists selection. Absolutely pathetic. Original was movie was bad and this dubbing quality made it even worse.#GunturKaaram
— Mal-Lee | ಮಲ್ಲಿ (@MallikarjunaNH) February 9, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.