Mithun Chakraborty: మిథున్‌ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్‌ అప్డేట్‌.. వైద్యులు ఏమంటున్నారంటే?

బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన ఆయనకు శనివారం (ఫిబ్రవరి 10) తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.

Mithun Chakraborty: మిథున్‌ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్‌ అప్డేట్‌.. వైద్యులు ఏమంటున్నారంటే?
Mithun Chakraborty
Follow us
Basha Shek

|

Updated on: Feb 13, 2024 | 1:58 PM

బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఇటీవలే ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన ఆయనకు శనివారం (ఫిబ్రవరి 10) తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. మిథున్ చక్రవర్తి వయసు ఇప్పుడు 73 ఏళ్లు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు మిథున్ చక్రవర్తి ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్‌ను ఆస్పత్రి వైద్యులు అందించారు. ప్రస్తుతం ఈ సీనియర్‌ హీరో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా జాతీయ అవార్డు గ్రహీత నటుడు మిథున్ చక్రవర్తిని మా ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు. ఎంఆర్‌ఐ సహా పలు పరీక్షలు చేశారు. అప్పుడు ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని తెలిసింది. దీంతో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో మిథున్‌కు వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, మితంగా ఆహారం కూడా తీసుకుంటున్నారని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. న్యూరోఫిజిషియన్, కార్డియాలజిస్ట్‌తో సహా చాలా మంది వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు చెక్‌ చేస్తున్నారని ఆస్పత్రి హెల్త్‌ అప్‌ డేట్‌ అందించింది.

ప్రముఖ నటి దేవశ్రీ రాయ్ ఆసుపత్రికి వెళ్లి మిథున్ చక్రవర్తి ఆరోగ్యంపై ఆరా తీశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పుడు మిథున్ చక్రవర్తి ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఆయన షుగర్ లెవెల్ తగ్గింది. ప్రస్తుతం ఐసీయూ నుంచి మరో వార్డుకు మిథన్‌ను తరలించారు. ఆయన ఆరోగ్యం క్రమంగా మెరగవుతోంది’ అని దేవశ్రీ తెలిపారు. ప్రముఖ దర్శకుడు పతిక్రిత్ బసు కూడా మిథున్ చక్రవర్తిని కలుసుకుని మాట్లాడారు. వీలైనంత త్వరగా కోలుకుని షూటింగ్‌లో పాల్గొంటానని మిథున్ చక్రవర్తి హామీ ఇచ్చారని బసు తెలిపారు. మిథున్ చక్రవర్తి 1976 నుంచి సినిమా ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్నారు. ‘డిస్కో డాన్సర్‌’, ‘జంగ్‌’, ‘ప్రేమ్‌ ప్రతిజ్ఞ’, ‘ప్యార్‌ జుక్తా నహీ’, ‘మర్ద్‌’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే 2024 సంవత్సరానికి గాను ఆయనకు ‘పద్మభూషణ్’ అవార్డు లభించింది. ఇది జరిగిన కొన్ని రోజులకే మిథన్‌ తీవ్ర అనారోగ్యానికి గురికావడం అభిమానులను ఆవేదనకు గురిచేసింది.

ఇవి కూడా చదవండి

ఆస్పత్రిలో మిథున్ చక్రవర్తి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి