Valentines Night OTT: వేలంటైన్స్‌ డే స్పెషల్‌.. ఓటీటీలోకి రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే?

30 వెడ్స్‌ 21 వెబ్‌ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు చైతన్య రావ్‌. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు స్టార్‌ హీరోల సినిమాల్లో స్పెషల్‌ రోల్స్‌తో అలరిస్తున్నాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. ఇటీవల చైతన్య రావు నటించిన కీడా కోలా మూవీ కూడా సూపర్‌ హిట్‌గా నిలిచింది

Valentines Night OTT: వేలంటైన్స్‌ డే స్పెషల్‌.. ఓటీటీలోకి రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే?
Valentines Night Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 14, 2024 | 1:40 PM

30 వెడ్స్‌ 21 వెబ్‌ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు చైతన్య రావ్‌. ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు స్టార్‌ హీరోల సినిమాల్లో స్పెషల్‌ రోల్స్‌తో అలరిస్తున్నాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. ఇటీవల చైతన్య రావు నటించిన కీడా కోలా మూవీ కూడా సూపర్‌ హిట్‌గా నిలిచింది. కాగా చైతన్య రావు నటించిన వాలంటైన్స్‌ నైట్‌ గతేడాది థియేటర్లలో రిలీజైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ గోపిరెడ్డి తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్‌ స్టోరీలో సునీల్‌ కూడా ఒక కీలక పాత్ర పోషించాడు. వాలంటైన్స్‌ నైట్‌ మూవీకి పాజిటివ్‌ టాక్‌ వచ్చినా పెద్దగా ఆడలేదు. ప్రమోషన్లు కూడా సరిగా నిర్వహించకపోవడం ఈ సినిమాకు మైనస్‌గా మారింది. అయితే ఇప్పుడీ ప్రేమకథా చిత్రం డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. ఏడాది తర్వాత ఓటీటీలో సందడి చేయనుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ఆహా వాలంటైన్స్‌ నైట్‌ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో వేలంటైన్స్‌ డే తర్వాతి రోజు అంటే ఫిబ్రవరి 15న ఈ లవ్ స్టోరీని ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని ఈటీవీ విన్‌ తమ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా అధికారికంగా ప్రకటించింది.

వాలెంటైన్స్ నైట్ సినిమాలో చైతన్య రావ్, ప్రియ హీరోహీరోయిన్లుగా నటించారు. సునీల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో మెరిశాడు. శ్రీకాంత్ అయ్యంగార్, పోసాని కృష్ణమురళి, జబర్దస్త్ అవినాశ్, రవివర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కథను అందించడంతో పాటు దర్శకత్వం వహించారు అనిల్ గోపీరెడ్డి. సంగీతం కూడా ఆయనే అందించారు. స్వామ్ మూవీస్ బ్యానర్‌పై తృప్తి పాటిల్, సుధీర్ యాళంగి, మహిధర్ సంయుక్తంగా వేలంటైన్స్‌ నైట్‌ సినిమాను నిర్మించారు. మరి ప్రేమికుల రోజు ఒక మంచి లవ్‌ స్టోరీని చూడాలనుకుంటే ఈ వేలంటైన్స్ నైట్‌పై ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

ఈటీవీ విన్ లో రాబోయే సినిమాలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.