Merry Christmas OTT : ఓటీటీలోకి విజయ్‌ సేతుపతి, కత్రినాల ‘మెర్రీ క్రిస్మస్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

కోలీవుడ్‌ వెర్సటైల్‌ యాక్టర్‌ విజయ్‌ సేతుపతి నటించిన తాజా చిత్రం మెర్రీ క్రిస్మస్‌. చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ ఈ సినిమాతో సౌత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అంధాదూన్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న శ్రీరామ్ రాఘ‌వ‌న్ మెర్రీ క్రిస్మస్‌ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రాధికా ఆప్టే, రాధికా శ‌ర‌త్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు

Merry Christmas OTT : ఓటీటీలోకి విజయ్‌ సేతుపతి, కత్రినాల 'మెర్రీ క్రిస్మస్‌'.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?
Merry Christmas Movie
Follow us
Basha Shek

|

Updated on: Feb 13, 2024 | 3:10 PM

కోలీవుడ్‌ వెర్సటైల్‌ యాక్టర్‌ విజయ్‌ సేతుపతి నటించిన తాజా చిత్రం మెర్రీ క్రిస్మస్‌. చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ ఈ సినిమాతో సౌత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అంధాదూన్‌ లాంటి బ్లాక్‌ బస్టర్‌ను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న శ్రీరామ్ రాఘ‌వ‌న్ మెర్రీ క్రిస్మస్‌ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రాధికా ఆప్టే, రాధికా శ‌ర‌త్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. జ‌న‌వ‌రి 12న థియేట‌ర్ల‌లో విడుదలైన ఈ మర్టర్‌ మిస్టరీ థ్రిల్లర్‌ ఆడియెన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ మూవీ విడుదలైంది. ఎప్పటిలాగే శ్రీరామ్ రాఘ‌వ‌న్ టేకింగ్‌, విజువ‌ల్స్, యాక్షన్‌ సీన్స్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక విజయ్‌, కత్రినాల నటన కూడా అదిరిపోయిందని కామెంట్స్ వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్‌ను థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ అందించిన మెర్రీ క్రిస్మస్‌ త్వరలోనే డిజిటల్‌ స్ట్రీమింగ్‌ కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ నెట్‌ ఫ్లిక్స్‌ ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 8న మెర్రీ క్రిస్మ‌స్ ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ఈ మూవీ స్ట్రీమింగ్‌ కు రానుంది. త్వ‌ర‌లోనే మెర్రీ క్రిస్మ‌స్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఫ్రెంచ్ న‌వ‌ల బ‌ర్డ్ ఇన్ ఏ కేజ్ ఆధారంగా ద‌ర్శ‌కుడు శ్రీరామ్ రాఘ‌వ‌న్‌ మెర్రీ క్రిస్మ‌స్ సినిమాను తెర‌కెక్కించాడు. టిప్స్‌ ఫిలిమ్స్‌, మ్యాచ్‌ బాక్స్‌ మూవీస్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ప్రీతమ్‌, డేనియల్‌ బీ. జార్జ్‌ సంగీతం, బీజీఎమ్‌ అందించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఓ హోట‌ల్‌లో ఆల్బ‌ర్ట్‌కు (విజ‌య్ సేతుప‌తి) మరియా (కత్రినా కైఫ్‌) తో ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. మ‌రియాను ప్రేమించి పెళ్లిచేసుకున్న జెరోమీ ఆమెను దూరం పెడుతుంటాడు. మ‌రో అమ్మాయితో వివాహేతర సంబంధం కొన‌సాగిస్తుంటాడు. భ‌ర్త‌పై కోపంతో ఆల్బ‌ర్ట్‌ను డేట్ కోసం త‌న ఇంటికి తీసుకొస్తుంది మ‌రియా. భ‌ర్త జెరోమీని తానే చంపేసి ఆ హత్య నుంచి తెలివిగా బ‌య‌ట‌ప‌డాల‌ని అనుకుంటుంది మ‌రియా. మరి ఆల్బర్ట్‌ మరియా ప్లాన్‌ తెలుసుకున్నాడా? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మెర్రీ క్రిస్మస్‌ మూవీ చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మెర్రీ క్రిస్మస్ సినిమాలో విజయ్ సేతుపతి, కత్రినా..